ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు.. కాళోజీ 'బతుకంతా దేశానిది' నాటక ప్రదర్శన (ఫొటోలు)-telangana language day 2024 at ravindra bharathi over kaloji narayana rao birth anniversary bathukantha deshanidhi play ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు.. కాళోజీ 'బతుకంతా దేశానిది' నాటక ప్రదర్శన (ఫొటోలు)

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు.. కాళోజీ 'బతుకంతా దేశానిది' నాటక ప్రదర్శన (ఫొటోలు)

Updated Sep 10, 2024 03:27 PM IST Sanjiv Kumar
Updated Sep 10, 2024 03:27 PM IST

Kaloji Narayana Rao Birth Anniversary Celebrations: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 110వ జయంతి సందర్భంగా హైదారాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకంతా దేశానిది నాటక ప్రదర్శనను అద్భుతంగా ప్రదర్శించారు.

పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ 110వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

(1 / 6)

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాష దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను తిలకించి.. కాళోజీ సేవలను స్మరించుకున్నారు. 

(2 / 6)

ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన "బతుకంతా దేశానిది" నాటకం ప్రేక్షకులను అలరించింది. జీ శివ రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దకున్న ఈ నాటకం చూపరులను ఆద్యంతం కట్టిపడేసింది. 

(3 / 6)

కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు కురిశాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, ఉత్కంఠ భరిత మ్యూజిక్, లైటింగ్ అద్భుత అనుభవాన్ని పంచాయి. కాళోజీగా అద్భుతంగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు కరతాళ ధ్వనులు మోగాయి.  

(4 / 6)

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటక బృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని ఈ సందర్భంగా కోరారు. 

(5 / 6)

ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ. TETA బృందాన్ని కొనియాడారు. ఇలాంటి వేదికపై నాటకం ప్రదర్శించినందుకు టీమ్ సభ్యులు సంపత్, తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు