Raina on Dhoni: ఈ ఏడాది ట్రోఫీ గెలిచి.. మరో ఏడాది ఆడతా: రైనాతో ధోనీ-raina on dhoni says he is ready to play one more ipl season ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Raina On Dhoni: ఈ ఏడాది ట్రోఫీ గెలిచి.. మరో ఏడాది ఆడతా: రైనాతో ధోనీ

Raina on Dhoni: ఈ ఏడాది ట్రోఫీ గెలిచి.. మరో ఏడాది ఆడతా: రైనాతో ధోనీ

Hari Prasad S HT Telugu
May 08, 2023 08:25 PM IST

Raina on Dhoni: ఈ ఏడాది ట్రోఫీ గెలిచి.. మరో ఏడాది ఆడతా అని రైనాతో ధోనీ అన్నాడట. ఈ విషయాన్ని రైనానే వెల్లడించాడు. ఈ మధ్యే అతడు ధోనీతో మాట్లాడిన విషయాలను రైనా చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ సందర్భంగా ధోనీతో రైనా
ఐపీఎల్ సందర్భంగా ధోనీతో రైనా

Raina on Dhoni: ధోనీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడా లేదా? ఈ ప్రశ్నకు అతని ఫ్రెండ్, మాజీ సీఎస్కే టీమ్మేట్ అయిన సురేశ్ రైనా స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. నిజానికి ఆ మాటను ధోనీయే తనతో చెప్పినట్లు కూడా రైనా వెల్లడించాడు. జియో సినిమాలో వచ్చే ఐపీఎల్ ఎక్స్‌పర్ట్ లో మాట్లాడిన రైనా.. ఈ మధ్య ధోనీని కలిసినప్పుడు అతడు చెప్పిన విషయాన్ని చెప్పాడు.

yearly horoscope entry point

"ఈ ఏడాది ట్రోఫీ గెలిచి మరో ఏడాది ఆడతాను అని ధోనీ నాతో చెప్పాడు" అని రైనా అనడం విశేషం. నిజానికి ఈ మధ్య ఓ మ్యాచ్ లో టాస్ సందర్భంగా కూడా ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే నా చివరి సీజన్ అని మీరే డిసైడయ్యారు అని హోస్ట్ డానీ మోరిసన్ తో ధోనీ అన్నాడు. ఈ కామెంట్స్ తర్వాత ధోనీ మరో సీజన్ ఆడటం ఖాయమేనా అన్న చర్చ మొదలైంది.

ఇప్పుడు రైనా కామెంట్స్ చూస్తుంటే అదే నిజమని తేలిపోయింది. సీఎస్కేకు ధోనీ ఐదో టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా రైనా చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే మాత్రం వచ్చే ఏడాది కూడా అతన్ని ఎల్లో జెర్సీలో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. నిజానికి ధోనీకిదే చివరి సీజన్ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

దీంతో అతడు దేశంలో ఏ స్టేడియంలో ఆడినా కూడా అక్కడి లోకల్ ఫ్యాన్స్ కూడా సీఎస్కేకే సపోర్ట్ చేస్తున్నారు. ఒక రకంగా దేశంలోని ప్రతి స్టేడియం ఈ ఇండియన్ క్రికెట్ హీరోకు ఘనంగా వీడ్కోలు పలుకుతోంది. అయితే అతడు వచ్చే ఏడాది కూడా ఆడతాడంటే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Whats_app_banner

సంబంధిత కథనం