Jadeja meets Modi: తన ఎమ్మెల్యే భార్యతో కలిసి ప్రధాని మోదీని కలిసిన జడేజా-jadeja meets modi along with his mla wife ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jadeja Meets Modi: తన ఎమ్మెల్యే భార్యతో కలిసి ప్రధాని మోదీని కలిసిన జడేజా

Jadeja meets Modi: తన ఎమ్మెల్యే భార్యతో కలిసి ప్రధాని మోదీని కలిసిన జడేజా

Hari Prasad S HT Telugu

Jadeja meets Modi: తన ఎమ్మెల్యే భార్యతో కలిసి ప్రధాని మోదీని కలిశాడు టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా. జడేజా భార్య రివాబా గుజరాత్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

భార్య రివాబాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రవీంద్ర జడేజా

Jadeja meets Modi: టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం (మే 16) ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. తన ఎమ్మెల్యే భార్య రివాబాతో కలిసి అతడు మోదీ దగ్గరికి వెళ్లాడు. ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కోసం దేశ రాజధానికి వెళ్లిన జడేజా.. మోదీని కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించాడు.

ఆ సమయంలో జడేజా భార్య రివాబా వాళ్ల పక్కనే ఉంది. ఆమె ఆ మధ్య జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ రివాబా తరఫున జడేజా ప్రచారం చేశాడు. అప్పుడు కూడా ప్రధాని మోదీని అతడు కలిశాడు. ఇక ఇప్పుడు అతడు ఢిల్లీలోనే ఉండటంతో మర్యాదపూర్వకంగా ప్రధానిని మరోసారి కలిశాడు.

ఆ తర్వాత ఆ ఫొటోను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. "మిమ్మల్ని కలవడం గొప్పగా ఉంది నరేంద్ర మోదీ సాహెబ్. మన మాత్రుభూమి కోసం చేయాల్సిన హార్డ్ వర్క్, అంకితభావానికి మీరు గొప్ప నిదర్శనం. మీరు ఇలాగే అందరిలోనూ స్ఫూర్తి నింపుతారని ఆశిస్తున్నాను" అని జడేజా అన్నాడు. జడేజా ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

ఈ సీజన్ లో అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా బౌలింగ్ లో జడేజా తన మాయాజాలంతో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్ లోనే అతడు టీ20 క్రికెట్ లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అతని అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై టీమ్ 15 పాయింట్లతో ఐపీఎల్లో టేబుల్లో రెండోస్థానంలో ఉంది. చివరి మ్యాచ్ లో గెలిస్తే.. రెండోస్థానంలోనే ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కానుంది. చెన్నై తన చివరి లీగ్ మ్యాచ్ ను శనివారం (మే 20) ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది.

సంబంధిత కథనం