IPL 2023 stats: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లో నమోదైన పూర్తి రికార్డుల జాబితా ఇదే-ipl 2023 stats in league stage are here as these are the records broken
Telugu News  /  Sports  /  Ipl 2023 Stats In League Stage Are Here As These Are The Records Broken
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచిన విరాట్ కోహ్లి (AFP)

IPL 2023 stats: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లో నమోదైన పూర్తి రికార్డుల జాబితా ఇదే

22 May 2023, 22:03 ISTHari Prasad S
22 May 2023, 22:03 IST

IPL 2023 stats: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లో నమోదైన పూర్తి రికార్డుల జాబితా ఇదే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లీగ్ స్టేజ్ ముగిసే సమయానికే ఎన్నో గత రికార్డులు బ్రేకవడం విశేషం.

IPL 2023 stats: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ఆదివారం (మే 21)తో ముగిసింది. మొత్తం 70 మ్యాచ్ లు జరిగాయి. మంగళవారం (మే 23) నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో లీగ్ స్టేజ్ లో నమోదైన రికార్డులను ఓసారి చూస్తే.. పరుగుల వరద పారిన ఈ సీజన్ లో లెక్కకు మిక్కిలిగా రికార్డులు బ్రేకయ్యాయి. సిక్స్‌లు, 200+ స్కోర్లు, సెంచరీల పరంగా గత రికార్డులు బ్రేకయ్యాయి.

ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లో బ్రేకయిన రికార్డులు

- 7263 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు.

- ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ లోనే 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక ఐపీఎల్ సీజన్ లో నమోదైన అత్యధిక సెంచరీలు ఇవే. ఐపీఎల్ 2022లో 8 సెంచరీలతో ఉన్న రికార్డు బ్రేయింది.

- ముంబై ఇండియన్స్ ఈ ఏడాది నాలుగుసార్లు 200కుపైగా లక్ష్యాలను ఛేదించింది. ఒక సీజన్ లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లను చేజ్ చేసిన ఘనతను సొంతం చేసుకుంది.

- ఆర్సీబీ ఈ సీజన్ లో ఐదుసార్లు 200కుపైగా రన్స్ సమర్పించుకుంది. ఒక సీజన్ లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లు ఇచ్చిన రికార్డు ఇదే.

- ఈ ఏడాది ఇప్పటికే 35సార్లు ఒక ఇన్నింగ్స్ లో 200కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 18సార్లతో ఉన్న రికార్డు బ్రేకయింది.

- ఈ ఏడాది విరాట్ కోహ్లి 2 సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్లో మొత్తం 7 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

- ఈ ఏడాది లీగ్ స్టేజ్ లోనే 1066 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక సీజన్ లో నమోదైన అత్యధిక సిక్స్ ల రికార్డు ఇదే. 1062 సిక్స్ లతో 2022 సీజన్ పేరిట ఉన్న రికార్డు బ్రేకయింది.

- యశస్వి జైస్వాల్ 625 రన్స్ చేశాడు. ఒక సీజన్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే.

- జోస్ బట్లర్ ఈ ఏడాది ఐదుసార్లు డకౌటయ్యాడు. ఒక సీజన్ లో అత్యధిక డకౌట్లు అతడివే.

- దినేష్ కార్తీక్ 17సార్లు డకౌటయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌటైన రికార్డు కార్తీక్ దే. రోహిత్ శర్మ 16 డకౌట్లతో రెండోస్థానంలో ఉన్నాడు.

- యుజువేంద్ర చహల్ 187 వికెట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

- యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

- వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్ టైటన్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (2019, 2020) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ గా నిలిచింది.

సంబంధిత కథనం