IPL Playoffs Schedule: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖ‌రారు - ఏయే టీమ్స్‌ త‌ల‌ప‌డ‌నున్నాయంటే-ipl playoffs schedule 2023 csk vs gt lsg vs mi matches date and venue details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Playoffs Schedule: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖ‌రారు - ఏయే టీమ్స్‌ త‌ల‌ప‌డ‌నున్నాయంటే

IPL Playoffs Schedule: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖ‌రారు - ఏయే టీమ్స్‌ త‌ల‌ప‌డ‌నున్నాయంటే

HT Telugu Desk HT Telugu
May 22, 2023 11:15 AM IST

IPL Playoffs Schedule: ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయ‌మ‌య్యాయి. నాలుగు టీమ్‌లుప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి. ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఎవ‌రి మ‌ధ్య‌, ఎప్పుడు జ‌రుగ‌నున్నాయంటే...

గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్
గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్

IPL Playoffs Schedule: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే టీమ్‌లు ఏవ‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌తో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ముంబైఇండియ‌న్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. చివ‌రి బెర్తు కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్ పోటీప‌డ‌టంతో ఈ స్థానం ఎవ‌రికి ద‌క్కుతుందో అని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు.

కానీ గుజ‌రాత్ చేతిలో బెంగ‌ళూరు ఓట‌మి పాల‌వ్వ‌డంతో ముంబై ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. కాగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఖ‌రారైంది.

క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ చెన్నై వేదిక‌గా మే 23న సోమ‌వారం గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రుగ‌నుంది. చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ది.

ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది. మే 24న మంగ‌ళ‌వారం చెన్నై వేదిక‌గా ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో క్వాలిఫయ‌ర్ 1లో ఓట‌మి పాలై జ‌ట్టుతో ఎలిమినేట‌ర్‌ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన టీమ్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రుగ‌నుంది.

ఫైన‌ల్ మ్యాచ్ మే 28 ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రుగ‌నుంది. ఫైన‌ల్ చేరే టీమ్‌లు ఎవ‌న్న‌ది మ‌రో మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.

టాపిక్