IPL 2023 Points table: ఆర్సీబీ హవా మామూలుగా లేదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్‌లోనూ వాళ్లే-ipl 2023 points table updated as rcb moves to fifth orange and purple caps are with their players ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: ఆర్సీబీ హవా మామూలుగా లేదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్‌లోనూ వాళ్లే

IPL 2023 Points table: ఆర్సీబీ హవా మామూలుగా లేదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్‌లోనూ వాళ్లే

Hari Prasad S HT Telugu
Jan 08, 2024 06:54 PM IST

IPL 2023 Points table: ఆర్సీబీ హవా మామూలుగా లేదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్‌లోనూ వాళ్ల ప్లేయర్సే టాప్ లో ఉన్నారు. గురువారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత పాయింట్ల టేబుల్లోనూ ఆ టీమ్ ఐదో స్థానానికి దూసుకెళ్లింది.

ఐపీఎల్ 2023లో ఆర్సీబీ హవా
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ హవా (PTI)

IPL 2023 Points table: ఐపీఎల్ 2023లో గురువారం (ఏప్రిల్ 20) జరిగిన డబుల్ హెడర్ తర్వాత పాయింట్ల టేబుల్, ఆరెంజ్, పర్పుప్ క్యాప్ లీడర్లలో చాలా మార్పులు వచ్చాయి. మొత్తంగా చూస్తే ఒక్క మ్యాచ్ తోనే ఆర్సీబీ ఓ రేంజ్ లో సత్తా చాటింది. పాయింట్ల టేబుల్లో ఐదో స్థానానికి దూసుకెళ్లడమే కాదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లుగా ఆ టీమ్ ప్లేయర్స్ నిలిచారు.

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐదో స్థానానికి వెళ్లింది. ప్రస్తుతం ఆర్సీబీ ఆరు మ్యాచ్ లలో మూడు విజయాలు, మూడు పరాజయాలతో 6 పాయింట్లు సాధించింది. ఆ టీమ్ నెట్ రన్‌రేట్ నెగటివ్ గా ఉండటంతో సీఎస్కే, గుజరాత్ టైటన్స్ కంటే కింద ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఏడో స్థానానికి పడిపోగా.. రెండో మ్యాచ్ లో ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ 8లో, సీజన్ లో తొలి మ్యాచ్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనే కొనసాగుతున్నాయి.

ఐపీఎల్ పాయింట్ల టేబుల్
ఐపీఎల్ పాయింట్ల టేబుల్

ఆరెంజ్ క్యాప్.. డుప్లెస్సి టాప్

ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్

ఇక అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి టాప్ లోకి దూసుకెళ్లాడు. డుప్లెస్సి ఆరు మ్యాచ్ లలో 343 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 166.5 కావడం విశేషం. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 56 బంతుల్లోనే 84 రన్స్ చేసిన డుప్లెస్సి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

అటు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ గా చేసిన విరాట్ కోహ్లి 279 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కూడా హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్నర్ 285 పరుగులతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

పర్పుల్ క్యాప్.. సిరాజ్ టాప్

ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ లిస్ట్
ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ లిస్ట్

ఇక అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ టాప్ లోకి వెళ్లడం విశేషం. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన సిరాజ్.. 12 వికెట్లతో ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు. లక్నో సూపర్ కింగ్స్ బౌలర్ మార్క్ వుడ్, రాజస్థాన్ బౌలర్ యుజువేంద్ర చహల్, గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ముగ్గురూ తలా 11 వికెట్లతో రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. గుజరాత్ టైటన్స్ కే చెందిన మహ్మద్ షమి 10 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం