KKR vs DC: ఢిల్లీకి ఫ‌స్ట్ విక్ట‌రీ అందించిన వార్న‌ర్ - ఐపీఎల్‌లోనే చెత్త మ్యాచ్ అంటోన్న నెటిజ‌న్లు-warner hits half century as dc beat kkr by four wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Dc: ఢిల్లీకి ఫ‌స్ట్ విక్ట‌రీ అందించిన వార్న‌ర్ - ఐపీఎల్‌లోనే చెత్త మ్యాచ్ అంటోన్న నెటిజ‌న్లు

KKR vs DC: ఢిల్లీకి ఫ‌స్ట్ విక్ట‌రీ అందించిన వార్న‌ర్ - ఐపీఎల్‌లోనే చెత్త మ్యాచ్ అంటోన్న నెటిజ‌న్లు

Nelki Naresh Kumar HT Telugu
Apr 21, 2023 07:13 AM IST

KKR vs DC: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి విజ‌యాన్ని అందుకున్న‌ది. గురువారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2023లో ఢిల్లీ బోణీ చేసింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్
ఢిల్లీ క్యాపిట‌ల్స్

KKR vs DC: ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు ఢిల్లీ బోణీ చేసింది. గురువారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగులు చేసింది. సింపుల్ టార్గెట్‌ను ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి అతిక‌ష్టం మీద ఛేదించింది. కెప్టెన్ వార్న‌ర్ ఒంట‌రి పోరాటంతో ఢిల్లీకి విజ‌యాన్ని అందించాడు.

41 బాల్స్‌లో 11 ఫోర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు. మ‌నీష్ పాండే (21 ర‌న్స్‌), అక్ష‌ర్ ప‌టేల్ (19 ర‌న్స్‌)తో నిల‌క‌డ‌గా ఆడ‌టంతో క‌ష్టంగా 19.2 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ 128 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా వికెట్ కీప‌ర్ లిట‌న్ దాస్ రెండు స్టంప్స్ మిస్ చేయ‌డం, ఫీల్డ‌ర్లు కొన్ని క్యాచ్‌ల‌ను చేజార్చ‌డం ఢిల్లీకి క‌లిసివ‌చ్చింది. కోల్‌క‌తా స్పిన్న‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అంకుల్ రాయ్‌, నితీష్ రానా త‌లో రెండు వికెట్ల‌తో ఢిల్లీని భ‌య‌పెట్టారు.

అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. జేస‌న్ రాయ్ (39 బాల్స్‌లో 43 ర‌న్స్‌), ర‌సెల్ (31 బాల్స్‌లో 38 ర‌న్స్‌) మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ పేస‌ర్లు ఇషాంత్ శ‌ర్మ‌, నోర్జ్ స్పిన్న‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్ త‌లో రెండు వికెట్ల‌తో స‌మిష్టిగా రాణించి కోల్‌క‌తాను క‌ట్ట‌డి చేశారు.

ల‌క్ష్య ఛేద‌న‌ను ఢిల్లీ నెమ్మ‌దిగా ఆడ‌టంతో మ్యాచ్ బోరింగ్‌గా మారింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఒక్క సిక్స‌ర్ కూడా కొట్ట‌లేదు. సింపుల్ టార్గెట్‌ను ఛేదించ‌డాన‌కి ఢిల్లీ అప‌సోపాలు ప‌డ‌టంతో సోష‌ల్ మీడియాలో ఈ జ‌ట్టును నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు. ఐపీఎల్‌లోనే చెత్త‌ మ్యాచ్ ఇద‌ని అంటోన్నారు. ఈ ట్రోల్స్‌, మీమ్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

Whats_app_banner