RCB captain Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి.. ఎందుకో తెలుసా?
RCB captain Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ దగ్గర కోహ్లిని చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ డుప్లెస్సికి ఏమైంది?
RCB captain Virat Kohli: విరాట్ కోహ్లిని మరోసారి కెప్టెన్ గా చూసే అవకాశం అభిమానులకు దక్కింది. అతడు ఆర్సీబీ కెప్టెన్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లిని టాస్ దగ్గర చూసి అందరూ షాక్ తిన్నారు. అటు పంజాబ్ కింగ్స్ కూడా తమ రెగ్యులర్ కెప్టెన్ ధావన్ లేకపోవడంతో సామ్ కరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ఆర్సీబీ క్యాంప్ లో ఫాఫ్ డుప్లెస్సి ఉన్నా కూడా విరాట్ ఎందుకు కెప్టెన్ గా వచ్చాడన్నది చాలా మందికి అంతుబట్టలేదు. టాస్ సందర్భంగా హోస్ట్ మురళీ కార్తీక్ కూడా విరాట్ ను చూసి ఆశ్చర్యపోయాడు. అయితే దీనికి కోహ్లియే సమాధానమిచ్చాడు. డుప్లెస్సి గత మ్యాచ్ లో గాయపడినట్లు కనిపించింది. ప్రస్తుతం అతని గాయం తీవ్రత ఎలా ఉందన్న విషయం విరాట్ చెప్పకపోయినా.. డుప్లెస్సి ఇంపాక్ట్ ప్లేయర్ గా రానున్నట్లు మాత్రం కోహ్లి చెప్పాడు.
వైశాఖ్ విజయ్‌కుమార్ స్థానంలో డుప్లెస్సి ఇంపాక్ట్ ప్లేయర్ గా రానున్నట్లు విరాట్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో డుప్లెస్సి బ్యాటింగ్ మాత్రం చేసి వెళ్లిపోనున్నాడు. ఇంతకుముందు కేకేఆర్, ముంబై మ్యాచ్ లోనూ ఇలాగే జరిగింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసి వెళ్లిపోగా.. సూర్యకుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
"ఫాఫ్ ఇవాళ ఫీల్డింగ్ చేయడం లేదు. అతడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు. వైశాఖ్ స్థానంలో అతడు ఆడతాడు. మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా.. అదే అవకాశం వచ్చింది. ఇది తప్ప టీమ్ లో ఎలాంటి మార్పులు లేవు" అని విరాట్ తెలిపాడు. మరోవైపు గాయపడిన శిఖర్ ధావన్ ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా వస్తాడా లేదా అన్నది కరన్ చెప్పలేదు.
సంబంధిత కథనం