IPL 2023 Playoff Scenario : ప్లేఆఫ్స్‌లోకి వెళ్లాలంటే.. ఏ జట్టు ఇంకా ఎన్ని గేమ్‌లు గెలవాలి?-ipl 2023 playoff scenario rcb needs to win 2 matches and csk should win 1 match to qualify for playoffs ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Playoff Scenario : ప్లేఆఫ్స్‌లోకి వెళ్లాలంటే.. ఏ జట్టు ఇంకా ఎన్ని గేమ్‌లు గెలవాలి?

IPL 2023 Playoff Scenario : ప్లేఆఫ్స్‌లోకి వెళ్లాలంటే.. ఏ జట్టు ఇంకా ఎన్ని గేమ్‌లు గెలవాలి?

Anand Sai HT Telugu
May 15, 2023 01:41 PM IST

IPL 2023 Playoff Scenario : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పదహారవ ఎడిషన్‌లో హోరాహోరీగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక ప్లేఆఫ్స్ దగ్గర పడుతుండటంతో జట్లు గెలుపు మీద ఫోకస్ చేస్తున్నాయి. ఏయే జట్టు ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలిస్తే ప్లేఆఫ్స్ లోకి ప్రవేశిస్తాయి?

ఆర్సీబీ
ఆర్సీబీ (Twitter)

మే 14న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 112 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై(CSK) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించేది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు ఓడిపోవడంతో మరో మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సిందే.

ఇలా మే 14న మ్యాచ్‌ల ఫలితాలతో ప్లేఆఫ్‌లోకి ప్రవేశించే అవకాశాల్లో చాలా మార్పులు ఉన్నాయి. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఒక జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలనే సమాచారం ఇక్కడ చూడండి.

గుజరాత్ టైటాన్స్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడి 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలవాల్సి ఉంది.

13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి, 4 మ్యాచ్‌లు ఓడి, ఒక్క మ్యాచ్‌లో ఫలితం చూడని చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్‌లో గెలవాలి.

12 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి, 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంది.

12 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ఓడిపోయి, 6 మ్యాచ్‌లు గెలిచి ఒక్క మ్యాచ్‌లో ఫలితం చూడని లక్నో సూపర్ జెయింట్ 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాల్సిన అవసరం ఉంది.

12 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన అవసరం ఉంది.

12 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిన రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన అవసరం ఉంది.

13 మ్యాచుల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 7 మ్యాచ్‌లు ఓడిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా 14 పాయింట్లు సాధించి ప్లేఆఫ్‌కు దూరమవుతుంది.

12 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన అవసరం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 7 మ్యాచ్‌లు ఓడిపోయి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో అన్ని మ్యాచ్‌లు గెలిచినా 14 పాయింట్లే వస్తాయి. ప్లేఆఫ్స్ కష్టమే.

12 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి, 8 మ్యాచ్‌లు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది.

Whats_app_banner