Gold and silver rates today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇవే..!-gold and silver rates today 15th may 2023 check latest prices in hyderabad mumbai and delhi ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇవే..!

Gold and silver rates today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇవే..!

Sharath Chitturi HT Telugu
May 15, 2023 09:40 AM IST

Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆ వివరాుల..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,650గా ఉంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,66,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,665గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 61,800గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,18,000గా కొనసాగుతోంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,800గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,350గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,850గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,850గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సైతం సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,480గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 74,800గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇద ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,800.. బెంగళూరులో రూ. 78,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 140 పెరిగి.. రూ 27,830కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,690గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం