KKR vs RR : కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్.. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే గెలవాల్సిందే-ipl 2023 kkr vs rr both teams eye on playoffs need important 2 points from this match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Rr : కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్.. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే గెలవాల్సిందే

KKR vs RR : కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్.. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే గెలవాల్సిందే

Anand Sai HT Telugu
May 11, 2023 01:01 PM IST

IPL Playoffs : మే 11న ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టోర్నీ చివరి దశకు చేరుకోవడంతో ప్రతి మ్యాచ్ ఫలితాలు కూడా కీలకం కానున్నాయి. టోర్నీలో ప్లేఆఫ్ దశకు చేరుకునేందుకు అన్ని జట్లు పోరాడుతున్నాయి.

కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్
కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్

కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు మే 11న పోటీ పడనున్నాయి. ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు బలంగా అనుకుంటున్నాయి. ప్లేఆఫ్స్ కు మార్గం సుగమం చేసుకోవాలంటే.. జరగబోయే ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.

ఈ రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా నేటి మ్యాచ్‌తో కలిపి మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలా ప్రతి మ్యాచ్‌లో లభించే రెండు పాయింట్లు చాలా కీలకంగా మారాయి. ఇది అభిమానుల్లో కూడా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 గెలిచి, 6 ఓడింది. తద్వారా RR 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఆరంభంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్ రాయల్స్ గత ఆరు మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడి కష్టాల్లో పడింది. గత మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన ఆర్ఆర్ ఓటముల పరంపర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

కోల్ కతా నైట్ రైడర్స్(kolkata knight riders) జట్టు ఇటీవల అద్భుత ప్రదర్శన చేయగలిగింది. KKR జట్టు.. RR మాదిరిగానే ఆడిన 11 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లను కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్‌పై భారీ విజయంతో KKRలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక తాజాగా జరగబోయే పోరులో గెలవాలని చూస్తోంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం.. ఐపీఎల్(IPL) చరిత్రలో ఇప్పటివరకు 83 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలమైనది, అత్యధిక స్కోర్ చేసిన జట్లు ఉన్నాయి. ఇక్కడ 180 కంటే ఎక్కువగా పరుగు చేయాలి. లేకుంటే ఇబ్బందే.

రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, షిమ్రోన్ హిట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ జురెల్, ర్యాన్ పరాగ్, పర్దీష్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, చావిన్ ., KC కరియప్ప, జాసన్ హోల్డర్, డోనోవన్ ఫెరీరా, సందీప్ శర్మ, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, KM ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ PA, జో రూట్.

కోల్‌కతా నైట్ రైడర్స్ : నితీష్ రాణా (కెప్టెన్), వరుణ్ చక్రవర్తి, లక్కీ ఫెర్గూసన్, రహమానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, టిమ్ సౌతీ, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, వైభవ్ యాదవ్, జగదీసన్, సుయాష్ శర్మ, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిటన్ దాస్, మన్‌దీప్ సింగ్, జాసన్ రాయ్, ఆర్య దేశాయ్.

Whats_app_banner