Gavaskar on Dhoni: నేను ధోనీ అభిమానిని.. మరోసారి అతని ఆటోగ్రాఫ్ తీసుకుంటా: గవాస్కర్-gavaskar on dhoni says he will be fan of him forever ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar On Dhoni Says He Will Be Fan Of Him Forever

Gavaskar on Dhoni: నేను ధోనీ అభిమానిని.. మరోసారి అతని ఆటోగ్రాఫ్ తీసుకుంటా: గవాస్కర్

Hari Prasad S HT Telugu
May 29, 2023 05:55 PM IST

Gavaskar on Dhoni: నేను ధోనీ అభిమానిని.. మరోసారి అతని ఆటోగ్రాఫ్ తీసుకుంటా అని గవాస్కర్ అనడం విశేషం. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్లో ధోనీ చెన్నైలో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత సన్నీ అతని ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయం తెలిసిందే.

తన షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న గవాస్కర్
తన షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న గవాస్కర్ (ANI)

Gavaskar on Dhoni: తానెప్పటికీ ధోనీ అభిమానిగానే ఉంటానని స్పష్టం చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఐపీఎల్ ఫైనల్ కు ముందు అతడు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ధోనీ గొప్పతనం గురించి వివరించాడు. కుదిరితే ఈ ఫైనల్ తర్వాత మరోసారి తాను ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకుంటానని సన్నీ అనడం విశేషం. 1983లో వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్ లో గవాస్కర్ సభ్యుడు కాగా.. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కు ధోనీ కెప్టెన్.

ట్రెండింగ్ వార్తలు

ఈ సీజన్ ఐపీఎల్లో ధోనీ తన సీఎస్కే హోమ్ గ్రౌండ్ చెపాక్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత గవాస్కర్ తన షర్ట్ పై అతని ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయం తెలుసు కదా. అంత గొప్ప క్రికెటర్ కూడా ఓ సాధారణ అభిమానిలాగా మిస్టర్ కూల్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం అభిమానులను ఆకర్షించింది. అయితే తానెందుకు ధోనీకి అభిమానినో సన్నీ మరోసారి వివరించాడు.

"ఇండియన్ క్రికెట్ కు అతడు చేసిన సేవకుగాను నేను ధోనీకి అభిమానిగా మారిపోయాను. ప్రతి ఏటా అతడు తన గొప్పతనాన్ని చాటుతూనే ఉన్నాడు. నేనెప్పుడూ ధోనీ అభిమానిగానే ఉంటాను. ఐపీఎల్ ఫైనల్ తర్వాత అతని నుంచి మరో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటున్నాను" అని గవాస్కర్ చెప్పాడు. ఇక ఇదే షోలో ఉన్న హర్భజన్ సింగ్ కూడా ధోనీపై ప్రశంసలు కురిపించాడు.

"ఒకసారి టీమ్ సెట్ అయిన తర్వాత ధోనీ అయినా, టీమ్ మేనేజ్‌మెంట్ అయినా తుది జట్టులో మార్పులు చేయడానికి ప్రయత్నించలేదు. బెంచ్ పై ఎలాంటి ప్లేయర్ ఉన్నా పట్టించుకోలేదు. అత్యధిక ధర చెల్లించి వాళ్లు కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఎందుకంటే ఆ టీమ్ కాంబినేషన్ బాగా ఆడుతోంది కాబట్టి. ఆటగాళ్లపై విశ్వాసముంచడం పెద్ద జట్లను ముందుకు తీసుకెళ్తుంది. సీఎస్కేనే దానికి నిదర్శనం" అని హర్భజన్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం