Dhoni Autograph: గవాస్కర్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోనీ - వీడియో వైరల్
Dhoni Autograph: ఆదివారం కోల్‌కతానైటర్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dhoni Autograph: సమకాలీన క్రికెట్‌లో ధోనీ ఆటతీరు, వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీ అభిమానుల జాబితాలో టీమ్ ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ రింకు సింగ్ చేరాడు. ఆదివారం కోల్‌కతానైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరిగింది.
ఈ పోరులో కోల్‌కతా చేతిలో చెన్నైఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కాగా చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే చివరి మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానుల కేరింతలతో స్టేడియం హోరేత్తిపోయింది. మ్యాచ్ ముగిసిన చెన్నై ఆటగాళ్లతో కలిసి ధోనీ స్టేడియంలో సందడి చేశాడు. అభిమానుల ఆనందాల్ని తన ఫోన్‌లో బంధించాడు. అదే సమయంలో స్టేడియంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది.
టీమ్ ఇండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ధోనీని ఆటోగ్రాఫ్ అడిగాడు. దిగ్గజ క్రికెటర్ కోరికను వినూత్నంగా నెరవేర్చాడు ధోనీ. సునీల్ గవాస్కర్ షర్ట్‌పై సంతకం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రింకు సింగ్ జెర్సీపై ఆటోగ్రాఫ్
అలాగే హాఫ్ సెంచరీతో చెన్నై ఓటమికి కారణమైన కోల్‌కతా హిట్టర్ రింకు సింగ్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్‌ను జెర్సీపై తీసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ దగ్గరకు వచ్చిన రింకు సింగ్ కోల్‌కతా జెర్సీపై ధోనీ ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు.
రింకు సింగ్ కోసం కోల్‌కతా జెర్సీపై ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కోల్‌కతా చేతిలో ఓటమి పాలైనా చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
ప్రస్తుతం పదిహేను పాయింట్లతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. మరోవైపు ధోనీకి ప్లేయర్‌గా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ సీజన్ నుంచి అతడు క్రికెటర్‌గా స్టేడియంలో దిగకపోవచ్చు. కేవలం మెంటర్‌గానే చెన్నై టీమ్‌కు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
టాపిక్