Sehwag on Dhoni: ధోనీ ఆ ఒక్క కారణంతోనే టీమ్‌లో ఉన్నాడు.. లేదంటేనా..: సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
Sehwag on Dhoni: ధోనీ ఆ ఒక్క కారణంతోనే టీమ్‌లో ఉన్నాడు.. లేదంటేనా అంటూ సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సీఎస్కేలో కేవలం కెప్టెన్సీ కోసమే అతడు ఆడుతున్నాడని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి వర్తించదని వీరూ అభిప్రాయపడ్డాడు.
Sehwag on Dhoni: ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. ధోనీ సహా. నిజానికి వచ్చే ఏడాది ధోనీ కచ్చితంగా ఆడతాడని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతని కెరీర్ ను మరింత పొడిగించిందని సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో చెప్పిన విషయం తెలుసు కదా. కానీ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం దీనితో విభేదిస్తున్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి వర్తించదని, అసలు ధోనీ టీమ్ లో ఉన్నదే కేవలం కెప్టెన్సీ కోసం కదా అని వీరూ అన్నాడు. క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ.. ధోనీ భవిష్యత్తుపై సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"ఫిట్‌గా ఉంటే 40ల్లోనూ క్రికెట్ ఆడటం కష్టం కాదు. ఈ ఏడాది ధోనీ పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. తన మోకాలి గాయాన్ని ఎక్కువ చేసుకోలేదు. చాలా వరకూ అతడు చివరి రెండు ఓవర్లలోనే బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు ఆడిన మొత్తం బాల్స్ లెక్కేస్తే మహా అయితే 40-50 బంతులు ఆడి ఉంటాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనీకి వర్తించదు. ఎందుకంటే అతడు టీమ్ లో ఉన్నదే కెప్టెన్సీ కోసం. అతడు ఆ కెప్టెన్సీ కోసం గ్రౌండ్ లోనే ఉండాలి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రం కేవలం బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ చేయని వాళ్లకు, లేదంటే బ్యాటింగ్ అవసరం లేని ఓ బౌలర్ కు వర్తిస్తుంది.
ధోనీ కచ్చితంగా 20 ఓవర్లపాటు ఫీల్డ్ లో ఉండాలి. ఒకవేళ అతడు కెప్టెన్ కాకపోతే ఇంపాక్ల్ ప్లేయర్ గానూ ఆడడు. అప్పుడు అతన్ని మెంటార్ లేదా కోచ్ లేదా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా చూడొచ్చు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
నిజానికి వచ్చే ఏడాది తాను ఆడతానా లేదా అన్న విషయంపై ధోనీ క్లారిటీ ఇవ్వలేదు. దానికి ఇంకా 8, 9 నెలల సమయం ఉన్నదని, ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకు అని ధోనీ కామెంట్ చేయడం విశేషం. తనకు ఆలోచించుకోవడానికి చాలా సమయం ఉన్నదని స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం