MS Dhoni Retirement : ఈ ఐపీఎల్​తో ధోనీ గుడ్ బై చెప్పనున్నాడా? నెక్ట్స్ చెన్నై కోచ్?-csk vs gt ipl 2023 clarity on ms dhoni retirement after csk vs gt final match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Csk Vs Gt Ipl 2023 Clarity On Ms Dhoni Retirement After Csk Vs Gt Final Match

MS Dhoni Retirement : ఈ ఐపీఎల్​తో ధోనీ గుడ్ బై చెప్పనున్నాడా? నెక్ట్స్ చెన్నై కోచ్?

Anand Sai HT Telugu
May 28, 2023 01:45 PM IST

IPL 2023 Final, CSK Vs GT : ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అవుతాడని అంటున్నారు.

ఎంఎస్ ధోనీ
ఎంఎస్ ధోనీ (Twitter)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్(CSK Vs GT) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అనేక ప్రత్యేక సంఘటనలు చోటు చేసుకోనున్నాయి. నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలిస్తే.. ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకున్నట్టు అవుతుంది. గుజరాత్ గెలిస్తే వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఎంఎస్ ధోని(MS Dhoni), శుభ్‌మన్ గిల్‌లు చారిత్రక రికార్డును లిఖించేందుకు సిద్ధమయ్యారు. ధోనీ ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2023(IPL 2023)తో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు సమాచారం. IPL 2023 ప్రారంభమైనప్పటి నుండి, ధోని రిటైర్మెంట్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. దీనిపై ధోనీతో సహా ఎవరూ ఇప్పటి వరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. ధోని రిటైర్మెంట్(Dhoni Retirement) గురించి చాలా మంది మాట్లాడారు. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం ఎవరూ ఇవ్వలేదు. ధోనీ కూడా ఈ విషయంపై మౌనంగా ఉన్నాడు. నేడు ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కావడంతో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

రిటైర్మెంట్ తర్వాత ధోనీ CSK జట్టు కోచ్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ధోనీ, నేను రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 8 నుండి 9 నెలల సమయం ఉందని చెప్పాడు. నేను ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్ మద్దతుదారుని ఉంటానని గతంలోనే ప్రకటించాడు. అది ఆడినా లేదా జట్టుకు దూరంగా ఉన్నా కూడా మద్దతు ఉంటుందని తెలిపాడు.

దీని ద్వారా ధోనీ పరోక్షంగా తనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం ఉన్నందున ఇది తన చివరి ఐపీఎల్ అని చెప్పకనే చెప్పాడని కొంతమంది అంటున్నారు. అయితే చెన్నైతో ఉంటానని ధోనీ చెప్పడంతో ఐపీఎల్ 2024లో కోచ్‌గా ఉంటాడేమోనని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఎంఎస్ ధోని ప్రస్తుతం మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత చికిత్స తీసుకోనున్నాడు. చెన్నైకి విజయం అందించి.. ధోనీ వీడ్కోలు పలుకుతాడో లేదో చూడాలి.

నిజానికి ధోనీ కూడా తన రిటైర్మెంట్ పై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. గతేడాది మాత్రం 2023 ఐపీఎల్లే తన చివరి సీజన్ అని దాదాపు ఖాయం చేసిన అతడు.. ఈసారి మాత్రం మాట మార్చాడు. గుజరాత్ టైటన్స్(Gujarat Titans)తో మ్యాచ్ తర్వాత కూడా ఇదే ప్రశ్నను ధోనీని అడిగితే.. దానికి స్పష్టమైన సమధానం ఇవ్వలేదు.

WhatsApp channel