(1 / 5)
శనివారం (మే 20) జరిగిన ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగా గెలిచింది. దీంతో 12వ సారి ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టింది.
(AFP)(2 / 5)
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (79), డెవాన్ కాన్వే (87) అర్ధ సెంచరీలతో 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది చెన్నై.
(PTI)(3 / 5)
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 86 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
(AFP)(4 / 5)
ఈ మ్యాచ్‌లో చెన్నై ప్రత్యేక రికార్డును లిఖించింది. ఢిల్లీపై అత్యధిక పరుగులు సాధించింది. 223 పరుగులు చేసి 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
(ANI)(5 / 5)
2012లో ఢిల్లీపై CSK నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది. ఆ రోజు క్వాలిఫయర్‌లో ఢిల్లీపై చెన్నై 222 పరుగులు చేసింది. ఇప్పుడు మే 20న ఒక్క పరుగు ఎక్కువ చేసి రికార్డు లిఖించింది.
(AFP)ఇతర గ్యాలరీలు