Dhoni creates history: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోనీ.. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్
Dhoni creates history: ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు ధోనీ. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్లొ 250వ మ్యాచ్, 11వ ఫైనల్ ఆడుతుండటం విశేషం.
Dhoni creates history: మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ పేరిట మరో అరుదైన రికార్డు నమోదైంది. గుజరాత్ టైటన్స్ తో సోమవారం (మే 29) జరుగుతున్న ఐపీఎల్ 2023 ఫైనల్లో ఆడటం ద్వారా అతడు ఎవరికీ సాధ్యం కాని మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఐపీఎల్లో ధోనీకి ఇది 250వ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ అతడే.
నిజానికి ఆదివారమే (మే 28) ధోనీ ఈ ఘనత సాధించాల్సి ఉన్నా.. వర్షం కారణంగా ఫైనల్ రిజర్వ్ డే అయిన సోమవారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఓ ప్లేయర్ గా ధోనీకిది 11వ ఐపీఎల్ ఫైనల్ కాగా.. కెప్టెన్ గా పదవది. చెన్నైని 14 సీజన్లలో 10సార్లు ఫైనల్ తీసుకెళ్లిన ఘనత ధోనీదే. ఇక ఒకసారి 2017లో రైజింగ్ పుణె సూజర్ జెయింట్స్ టీమ్ తరఫున కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ధోనీ ఫైనల్ ఆడాడు.
ఐపీఎల్ 16 సీజన్లలో 11 ఫైనల్స్ ఆడటం అంటే మాటలు కాదు. ఇది ఊహకందని విషయం. మరో ప్లేయర్ ఈ ఘనత సాధిస్తాడని కూడా ఊహించలేం. ఇక తాజాగా జరుగుతున్న ఫైనల్లో ధోనీ కెప్టెన్సీలోని సీఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ శివమ్ దూబెను ఇంపాక్ట్ ప్లేయర్ గా సీఎస్కే ఉపయోగించుకోనుంది.
2008 నుంచి సీఎస్కే టీమ్ కెప్టెన్ గా ఉన్న ధోనీ.. మధ్యలో రెండేళ్లు ఆ టీమ్ పై నిషేధం విధించినప్పుడు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2016, 2017 సీజన్లు మినహా అన్నిసార్లూ సీఎస్కే కెప్టెన్ గా ధోనీ ఉన్నాడు. గతేడాది మొదట్లో కొన్ని మ్యాచ్ లకు జడేజా కెప్టెన్ గా ఉన్నా.. తర్వాత ధోనీ కెప్టెన్సీ తీసుకున్నాడు.
సంబంధిత కథనం