MI Vs GT Qualifier 2 : ముంబైకి మోహిత్ భారీ షాక్.. ఫైనల్‌లోకి ప్రవేశించిన గుజరాత్-ipl 2023 mi vs gt qualifier 2 gujarat titans entered the ipl final for the 2nd time after against mumbai indians ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Mi Vs Gt Qualifier 2 Gujarat Titans Entered The Ipl Final For The 2nd Time After Against Mumbai Indians

MI Vs GT Qualifier 2 : ముంబైకి మోహిత్ భారీ షాక్.. ఫైనల్‌లోకి ప్రవేశించిన గుజరాత్

HT Telugu Desk HT Telugu
May 27, 2023 05:37 AM IST

MI Vs GT Qualifier 2 : ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. 2వ క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన హార్దిక్ పాండ్యా జట్టు.. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్నాడు.

గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ (Twitter)

గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. 16వ ఎడిషన్‌ టైటిల్‌ను గెలుచుకునేందుకు ఎదురుచూస్తోంది. మే 28న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో టైటిల్ కోసం పోరాడనుంది. గుజరాత్ జట్టు ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ తో 6వ సారి ట్రోఫీపై కన్నేసిన రోహిత్ సేనకు హార్దిక్ షాకిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129) సూపర్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్​ వృద్ధిమాన్​ సహా (18) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సాయి సుదర్శన్​ హాఫ్​ సెంచరీకి దగ్గర్లో రిటైర్ట్​ హర్ట్​ అయ్యాడు. హార్దిక్​ పాండ్య (17), రషీద్​ ఖాన్ (5) పరుగులు చేశారు. దీంతో 234 పరుగుల భారీ స్కోరు సాధించింది గుజరాత్.

ఈ భారీ స్కోరును ఛేదించేందుకు ముంబై బ్యాటింగ్‌లో విఫలమైంది. సూర్యకుమార్ (61) క్రీజులో ఉంటే మ్యాచ్ గెలిచేదేమో. ఓపెనర్లు రోహిత్​ శర్మ (8), నేహల్​ వధేరా (4) కీలక మ్యాచ్​లో పేలవ ప్రదర్శన చేశారు. తిలక్​ వర్మ (43) స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు. కామెరూన్​ గ్రీన్ (30) పరుగులకే ఔట్ అయ్యాడు. ఫలితంగా 20 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి గుజరాత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం.

2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ వరుసగా రెండో సారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన 3వ జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మినహా మరే ఇతర జట్టు ఈ ఘనత సాధించలేదు. కిందటి ఏడాది కూడా ఛాంపియన్‌గా నిలిచింది గుజరాత్.

తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఫలితంగా సీఎస్‌కే నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. మే 28న ఇదే మైదానంలో ధోనీ సేనతో గుజరాత్.. టైటిల్ పోరు సాగనుంది.

7వ సారి ఫైనల్ చేరాలని కలలు కన్న ముంబైకి షాక్ ఇచ్చింది గుజరాత్. 2010లో రన్నరప్‌గా నిలిచిన ముంబై 2012, 2015, 2017, 2019, 2020లో ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై 4 సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడింది, 2 గెలిచింది మరియు 2 ఓడింది. గత ఐపీఎల్‌ సీజన్‌లో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్లు మరోసారి తలపడుతున్నాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తలపడిన ఇరు జట్లు ఆ తర్వాత తొలి క్వాలిఫయర్‌లో తలపడ్డాయి. ఇందులో చెన్నై గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇరు జట్లు 4 సార్లు తలపడగా, గుజరాత్ 3 సార్లు గెలిచింది.

WhatsApp channel