Ben Stokes in IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు-ben stokes in ipl 2023 as the england star on his way to play in the mega league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ben Stokes In Ipl 2023: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు

Ben Stokes in IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు

Hari Prasad S HT Telugu
Mar 23, 2023 09:49 PM IST

Ben Stokes in IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు. ఐపీఎల్ 2023 కోసం తాను బయలుదేరినట్లు ఓ ఫొటోను గురువారం (మార్చి 23) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు స్టోక్స్.

బెన్ స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో
బెన్ స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో

Ben Stokes in IPL 2023: ఐపీఎల్ కోసం అందరి కంటే ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మెగా లీగ్ సొంతగడ్డపై జరగనుండటం.. తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీ బహుశా తన చివరి సీజన్ ఆడనుండటంతో ఈసారి లీగ్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేస్తోంది. దీనికితోడు ఆ మధ్య వేలంలో బెన్ స్టోక్స్ లాంటి స్టార్ ప్లేయర్ ను సీఎస్కే సొంతం చేసుకోవడం కూడా చెన్నై ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది.

గత సీజన్ లో చెన్నై దారుణమైన ప్రదర్శనతో 9వస్థానంలో నిలిచింది. ఈసారి స్టోక్స్, ధోనీ కలిస్తే మళ్లీ తమ టీమ్ మునుపటి మ్యాజిక్ చేస్తుందన్న ఆశతో చెన్నై ఫ్యాన్స్ ఉన్నారు. ఈలోపే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందిస్తూ.. తాను ఐపీఎల్ కోసం వచ్చేస్తున్నానని బెన్ స్టోక్స్ గురువారం (మార్చి 23) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు.

త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అంటూ చెన్నై, ఐపీఎల్ ను ట్యాగ్ చేశాడు. దీనికి కేవలం తన షూస్ మాత్రమే కనిపిస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. గత వేలంలో బెన్ స్టోక్స్ ను చెన్నై టీమ్ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంలా స్టోక్స్ ను ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

చెన్నై ఫ్యాన్స్ అయితే అతనిప భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే స్టోక్స్ మాత్రం యాషెస్ సిరీస్ పై కన్నేశాడు. దీంతో ఈ సీజన్ మొత్తం చెన్నై ఫ్రాంఛైజీకి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. పైగా అతడు మోకాలి గాయంతోనూ బాధపడుతున్నాడు. అయినా సరే తాన చెన్నై టీమ్ కు ఆడతానని అతడు స్పష్టం చేశాడు.

యాషెస్ సిరీస్ కోసం స్టోక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని, లేదంటే తన మోకాలి గాయం మరింత తీవ్రమవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టోక్స్ ఎలా ఆడతాడు? ధోనీతో కలిసి చెన్నై టీమ్ రాతను అతడు మారుస్తాడా లేదా అన్నది చూడాలి. చెన్నై తమ తొలి మ్యాచ్ ను మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ తో ఆడనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం