Dhoni Ipl Records: ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్ చేరువలో ధోనీ - తొలి మ్యాచ్‌లోనే బ్రేక్ చేస్తాడా?
Dhoni Ipl Records: చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీకి 2023 ఐపీఎల్ చివరి సీజన్ కావచ్చునంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో బ్యాటింగ్ పరంగా ధోనీ అరుదైన రికార్డుకు చేరువ అయ్యాడు. ఆ రికార్డ్ ఏదంటే...
Dhoni Ipl Records: ధోనీకి రికార్డులు కొత్త కాదు. ఇంటర్‌నేషనల్ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో ధోనీ ఎన్నో తిరుగులేని రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా ఐపీఎల్‌లో అతడు మరో కొత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ చరిత్రను సృష్టించనున్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో 234 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4978 రన్స్ చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే ధోనీ 5000 పరుగుల రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు చెబుబోతున్నారు. ఈ సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించబోతున్నారు.
ఇదే అతడికి చివరి సీజన్ కావచ్చునంటూ వార్తలు వినిపిస్తున్నాయి మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నది. మార్చి 31 నుంచి మే 21 వరకు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఐపీఎల్ కోసం మార్చి 3 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. మార్చి 2న ధోనీ చెన్నైకి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గత ఏడాది తొమ్మిదో స్థానంతో ఐపీఎల్‌ను ముగించింది చెన్నై సూపర్ కింగ్స్.