Most runs in IPL for CSK : చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఎవరు? ధోనీ స్థానమెక్కడ?-top 5 players who are most runs in ipl for chennai super kings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top 5 Players Who Are Most Runs In Ipl For Chennai Super Kings

Most runs in IPL for CSK : చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఎవరు? ధోనీ స్థానమెక్కడ?

Mar 22, 2023, 07:23 AM IST Maragani Govardhan
Mar 22, 2023, 07:23 AM , IST

  • Most runs in IPL for CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మరికొన్ని రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 28 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

Murali Vijay CSK : చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్లలో మురళీ విజయ్ ముందు వరుసలో ఉంటాడు. సీఎస్‌కే తరఫున అతడు అనేక మ్యాచ్ విన్నంగ్ ప్రదర్శనలు చేశాడు. ఈ జట్టుతో సుదీర్ఘ కాలం ఆడిన ఆటగాళ్లో మురళీ కూడా ఒకడు. మురళీ విజయ్ చెన్నై తరఫున 89 మ్యాచ్‌లు ఆడి 2205 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధశతకాలు ఉన్నాయి.

(1 / 6)

mike hussey csk- ఆస్ట్రేలియా క్రికెటర్ మైక్ హస్సీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు. అతడు 64 మ్యాచ్‌లు ఆడి 2213 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 17 అర్ధశతకాలు ఉన్నాయి.

(2 / 6)

Faf du Plessis csk - ఐపీఎల్ చరిత్రలో ఫాఫ్ డుప్లెసిస్‌ను అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పరిగణించవచ్చు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ 2021 సీజన్ వరకు కూడా అతడు చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే తరఫున 92 మ్యాచ్‌లు ఆడిన అతడు 2721 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధశతకాలు ఉన్నాయి.

(3 / 6)

MS DHONI CSK - ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోనీ ఇప్పటి వరకు 228 మ్యాచ్‌లు ఆడి 39.13 సగటుతో మొత్తం 4853 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధశతకాలు ఉన్నాయి. చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానంలో ఉన్నాడు మహీ.

(4 / 6)

suresh raina CSK - చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సుదీర్ఘ కాలం ఆడిన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. వన్డౌన్ బ్యాటర్‌గా అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్న రైనా.. తన కెరీర్‌లో సీఏస్‌కే తరఫున 200 మ్యాచ్‌లు ఆడి 5510 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

(5 / 6)

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

(6 / 6)

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు