Mercury combust: బుధుడి అస్తంగత్వం.. వీరికి కనక వర్షం, ఈ రాశుల వారికి మాత్రం కష్టాలమయం
Mercury combust: బుధుడు నేటి నుంచి అస్తంగత్వ దశలో సంచరిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి కనక వర్షం కురిస్తే మరికొందరికి మాత్రం కష్టాలు పలకరించబోతున్నాయి.
Mercury combust: బుధుడిని తెలివితేటల గ్రహంగా చెబుతారు. గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తెలివిగా వ్యవహరిస్తాడు. మంచి శారీరక ఆరోగ్యం లభిస్తుంది. వ్యాపారం ఉద్యోగంలో మంచి విజయాలను అనుభవిస్తారు. బుధ గ్రహం ప్రతికూల ప్రభావాలు ఎవరి జాతకంలో రాహువు, కేతువు, కుజుడు ఉన్నారో వారిపై పడుతుంది.
ప్రస్తుతం బుధుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 3 నుంచి వృషభ రాశిలో అస్తంగత్వ దశలోకి వెళతాడు. సుమారు 24 రోజుల పాటు బుధుడు ఇదే స్థితిలో సంచరిస్తాడు. జూన్ 14న దహన స్థితిలోనే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 27 వరకు ఈ దశలోనే సంచరిస్తాడు. బుధుడు వాణిజ్యం, ఆలోచన, మేధస్సు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి వాటికి కారకుడికిగా చెప్తారు. బుధుడి అస్తంగత్వం కారణంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవడంలో, ఆలోచనాత్మకంగా ఏదైనా పనిని పూర్తి చేయడంలో ఇబ్బంది పడతారు. ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది వ్యక్తులు అత్యుత్తమ పనితీరును అందించలేకపోతారు.
కమ్యూనికేషన్ నైపుణ్యాలకు బుధుడు కారకుడుగా భావిస్తారు. అందువల్ల బుధుడు దహన స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన ఆలోచనలను సరిగా అమలుపరచలేక పోతాడు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది .వ్యాపార ఒప్పందంలో విజయవంతమైన చర్చలు చేయడం సవాల్ గా మారుతుంది.
బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు కొందరిలో మొండితనం ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి కష్టపడతారు. అయితే మరికొందరికి మాత్రం సృజనాత్మక ఆలోచనలతో బలమైన సమస్యలను కూడా ఇట్టే పరిష్కరించగలుగుతారు. బుధుడి దహనం సమయంలో ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం మంచిది కాదు. ఎందుకంటే అవి ఊహించిన ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. బదులుగా నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. బుధుడి కదలిక మార్పు ఎవరికి సానుకూల ఫలితాలు, ఎవరికి ప్రతికూల ఫలితాలు ఇస్తుందో చూద్దాం.
ఈ రాశులకు కనక వర్షమే
ధనుస్సు రాశి
బుధుడి దహనం ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుఖశాంతుల వాతావరణం నెలకొంటుంది. వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
కన్యా రాశి
బుధుడి దహన స్థితి కన్యా రాశి వారికి ప్రయోజనాలు అందిస్తుంది. సహోద్యోగులు, ఉన్నతాధికారుల మద్దతుతో వృత్తిలో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
వృశ్చిక రాశి
బుధుడి సంచారం వృశ్చిక రాశి వారికి ఎంత ప్రయోజనం ఇస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పరీక్షా పోటీలకు సన్నద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్నేహితుడి సాయంతో జీవితంలో ఎదురయ్య కష్టాలు తొలగిపోతాయి.
బుధుడి దహనం వల్ల ఈ రాశి వాళ్ళు రానున్న 24 రోజులు సమస్యలు, కష్టాలు ఎదుర్కోబోతున్నారు.
మేష రాశి
మేష రాశి మూడు, ఆరో ఇంటికి బుధుడు అధిపతిగా ఉన్నాడు. రెండో ఇంట్లో అస్తంగత్వం చెందుతాడు. దీనివల్ల ఆర్థిక విషయాలలో, ఇతరులతో మాట్లాడే విషయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఫలితంగా డబ్బు కొరత, వ్యక్తిగత సంబంధాలలో అశాంతి కనిపించవచ్చు. కెరీర్ పరంగా సవాళ్లు, అసంతృప్తి భావం పురోగతిని అడ్డుకుంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. తరచుగా కమ్యూనికేషన్ లోపం కారణంగా గొడవలు జరిగే అవకాశం ఉంది.
వృషభ రాశి
బుధుడి దహనం వృషభ రాశి మొదటి ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా జీవితంలో వివిధ కోణాల్లో సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత ఎదుగుదలలో అన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలకు సంబంధించి ఆందోళనలు మీ మనసుపై భారంగా ఉంటాయి. కెరీర్ పరంగా అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సహోద్యోగులతో సంభాషించేటప్పుడు సహనం పాటించడం మంచిది. వ్యాపార పరంగా మితమైన లాభాలు మాత్రమే లభిస్తాయి. ఇవి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ పొదుపు లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో బంధాలు బలహీనంగా ఉంటాయి.
మిథున రాశి
మిథున రాశి 12వ ఇంట్లో బుధుడి దహనం జరుగుతుంది. ఫలితంగా కెరీర్ జీవితం నిరుత్సాహంతో నిండిపోతుంది. అదృష్టం ఉండకపోవచ్చు. వ్యాపార రంగంలో లాభదాయకత క్షీణిస్తుంది. విజయాన్ని చేరుకునేందుకు అనేక సవాళ్లు అధిగమించాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టం సంభవించే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో పనిలో అశాంతి నెలకొనవచ్చు. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.