Mercury combust: అస్తంగత్వ దశలోకి బుధుడు.. జూన్ 2 నుంచి ఈ రాశుల వారికి కష్టాలు, పనుల్లో ఆటంకాలు
Mercury combust: బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన తర్వాత అస్తంగత్వ దశలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి.
Mercury combust: గ్రహాల రాకుమారుడు బుధుడు మే 31వ తేదీ మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే బుధుడు ప్రవేశించిన వెంటనే అస్తంగత్వ దశలోకి వెళతాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఒక గ్రహం దహనం అయినప్పుడు అది సూర్యుడికి చాలా దగ్గరగా ఉందని అర్థం.
కమ్యూనికేషన్స్, మేధస్సు, వాక్కు, విచక్షణ వంటి వాటికి బుధుడు కారకుడు. అటువంటి బుధుడు దహన స్థితిలోకి వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మనసు గందరగోళంగా అవుతుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం సవాలుగా మారవచ్చు. ఈ కాలంలో కమ్యూనికేషన్ లో అపార్థాలు ఏర్పడతాయి. అలాగే కొత్త సమాచారాన్ని గ్రహించడం లేదా వాటిని అర్థం చేసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది. బుధుడు అస్తంగత్వ దశలోకి వెళ్ళడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఎదురవుతాయి. మరికొన్నింటికి అశుభ పరిణామాలు ఎదురవుతాయి.
బుధుడి దహనం వల్ల ఇబ్బంది పడే రాశులు ఇవే
కన్యా రాశి
బుధుడు 1, 10 ఇంటికి అధిపతి. కన్యా రాశి తొమ్మిదో ఇంట్లో అస్తంగత్వ దశలోకి వెళతాడు. ఉద్యోగంలో మంచి పేరు, కీర్తి సాధ్యమవుతాయి. కానీ కెరీర్ లో ఆనందాన్ని పొందలేరు. సంతృప్తి చెందరు. పనితీరులో సమస్యలు కలిగిస్తుంది. అదృష్టం అండగా ఉండదు. ఉద్యోగ ఒత్తిడి అనుభవిస్తారు. మనోబలం తక్కువగా ఉండవచ్చు. పనిలో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేరు.
వృషభ రాశి
వృషభ రాశి 2, 5 గృహాలకు బుధుడు అధిపతి. ఒకటో ఇంట్లో దహనం అవుతాడు. ఫలితంగా వీరికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో సమస్యలకు దారి తీయవచ్చు. ప్రియమైన వారితో ఎక్కువగా వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. కెరీర్ లో వృద్ధి సాధించలేరు. కష్టపడి పని చేసినప్పటికీ సరైన గుర్తింపు సాధ్యం కాకపోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ మరింత ఆలస్యం కావచ్చు.
మిథున రాశి
మిథున రాశి 12వ ఇంట్లో బుధుడు అస్తంగత్వ దశలోకి వెళ్లనున్నాడు. కెరీర్ లో చాలా కృషి చేయాల్సి వస్తుంది. అప్పుడే సానుకూల ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులు త వ్యూహాలను మార్చుకోవాలి. శత్రువుల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి బుధుడు 2, 11 గృహాలకు అధిపతి. పదో ఇంట్లో దహనం జరుగుతుంది. ఈ సమయం వీరికి మంచిగా ఉండకపోవచ్చు. కొంత అదృష్టం ఉన్నప్పటికీ కోరికలు తీర్చలేకపోతారు. కెరీర్ కు సంబంధించి కాలం కూడా సాఫీగా ఉండకపోవచ్చు. పని ఒత్తిడి, అడ్డంకులు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు రాకపోవచ్చు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి 8, 11 గృహాలకు బుధుడు అధిపతి. ఏడో ఇంట్లో అస్తమిస్తాడు. అందువల్ల మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కెరీర్ కు సంబంధించి ఎక్కువ పని ఒత్తిడి ఉండవచ్చు. పనిలో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారానికి సంబంధించి పోటీ ఎదుర్కొంటారు. శత్రువులతో సరిగా పోరాడలేరు.
మీన రాశి
మీన రాశి 4, 7వ గృహాలకు అధిపతి. మూడో ఇంట్లో దహనం జరుగుతుంది. ఫలితంగా కెరీర్ కి సంబంధించి వృద్ధి ఉండకపోవచ్చు. పనికి సంబంధించి గుర్తింపు ఉండదు. వ్యాపారం చేస్తున్న వారికి ఉత్పాదకంగా ఉండకపోవచ్చు. శత్రువులు మీకు అడ్డంకులు సృష్టిస్తారు.