Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మలో వాడే పూలు ఏమిటి? ఈ రోజు సమర్పించే నైవేద్యం ఇదే
Engili pula bathukamma: అక్టోబర్ 2 అంటే ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఎంతో ఆనందంగా ఆడపడుచులు అందరూ ఒక్కచోటికి చేరి వేడుకలు చేసుకుంటారు. తీరోక్క పూలను అందంగా వలయాకారంలో రంగుల రంగుల పూలు పేరుస్తారు. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకుంటున్నారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులు అందరూ ఆడిపాడే సమయం వచ్చేసింది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. పల్లెల్లో ఆడవాళ్ళు ముందు రోజే పూలు సేకరించి పెట్టుకుంటారు.
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే మార్కెట్లన్నీ రంగు రంగుల పూలతో నిండిపోయాయి. సిటీలో పూలు కావాలంటే కొనుక్కోవాల్సిందే. మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకుంటారు. గునుగు, తంగేడు, చామంతి, బంతి వంటి పూలతో ఎంగిలి పూల బతుకమ్మ పేరుస్తారు. ఈరోజు కోసం ముందు రోజే పూలు కోసి పెట్టుకుని నీళ్ళలో వేసి ఉంచుకుంటారు. అవి నిద్ర చేశాయని అంటారు. అది మాత్రమే కాకుండా పూల కాడలను నోటితో తెంచుతారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం. అందుకే ఈరోజు జరుపుకునే పండుగకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చింది.
ఉదయం వేళ ఇంట్లోని మగవాళ్ళు తమ పూర్వీకులకు శ్రాద్ధ ఖర్మలు నిర్వహించుకుంటారు. మధ్యాహ్నం నాటికి వాటిని ముగించుకుని ఇంటికి చేరుకుని భోజనాధికాలు పూర్తి చేస్తారు. ఇక ఆడవాళ్ళు సాయంత్రం వేళ అందంగా ముస్తాబు అయి బతుకమ్మను తయారు చేసుకుంటారు. తమలపాకులు, తులసి ఆకులను మహిళలు ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు. బియ్యం పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
తొమ్మిది రోజుల సంబరాలు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, గ్రామీణ జీవన విధాన్ని ప్రతిబింబించే విధంగా పండుగ జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడతారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు అంటే దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. అనుబంధాలు, ఆత్మీయత, ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే భేదం లేకుండా అందరూ కలిసి మెలిసి ఆనందంగా జరుపుకునే సంప్రదాయ పండుగ ఇది.
ఆరో రోజు తప్ప మిగతా అన్ని రోజులు రకరకాల నైవేద్యాలు తయారు చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు అలిగిందని అంటారు. అందుకే బతుకమ్మ తయారు చేయరు, ఎలాంటి సంబరాలు జరుపుకోరు. ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద బతుకమ్మలు ఏర్పాటు చేసి దాని చుట్టూ చిన్న బతుకమ్మలు ఉంచుతారు. ఆడవాళ్ళు వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అనంతరం పారే నీళ్ళలో పోయిరావే బతుకమ్మ అంటూ సాగనంపుతారు.