Amavasya 2024: రేపే మహాలయ అమావాస్య- ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి
Amavasya 2024: అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య వచ్చింది. ఇదే రోజు సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ అమావాస్య ఎంతో ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకోండి.
సనాతన ధర్మంలో సర్వ పితృ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున మరణించిన పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయవచ్చు. సర్వ పితృ అమావాస్య అక్టోబర్ 2 బుధవారం నాడు వస్తుంది. దీనిని పితృ విసర్జన అమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా అంటారు.
మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రద్ధా ఆచారాలు, దానధర్మాలు చేయడం ద్వారా పితృ దోషం కూడా తొలగిపోతుంది. పితృ పక్ష శ్రాద్ధ పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి, వీటిని గుర్తుంచుకోవాలి. గరుడ పురాణం ప్రకారం సర్వ పితృ అమావాస్య నాడు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం. శ్రద్ధ పూజ నియమాలు ఏంటో తెలుసుకోండి.
సర్వ పితృ అమావాస్య నాడు ఏమి చేయాలి
నల్ల నువ్వుల వాడకం
శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు నల్ల నువ్వులను తప్పనిసరిగా వాడాలి. శ్రాద్ధాహారాన్ని తయారుచేసేటప్పుడు, తర్పణం సమర్పించేటప్పుడు, అన్నం ముద్దలు తయారు చేసేటప్పుడు నల్ల నువ్వులను ఉపయోగిస్తారు. నల్ల నువ్వులు తీర్థ జలాలను కలిగి ఉన్నాయని, దాని వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారని, దీవెనలు ఇస్తారని నమ్ముతారు.
బ్రాహ్మణ విందు
సర్వ పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టే సంప్రదాయం ఉంది. బ్రాహ్మణ విందు నిర్వహించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం.
కుశ గడ్డి
శ్రాద్ధ పూజ చేసేటప్పుడు లేదా తర్పణం సమర్పించేటప్పుడు చేతికి కుశ గడ్డితో చేసిన దాన్ని తప్పనిసరిగా ధరిస్తారు. పురాణాల ప్రకారం పూర్వీకులకు తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అదే సమయంలో తర్పణాన్ని ఎల్లప్పుడూ పూర్వీకుల పేరుతో, దక్షిణం వైపుగా ఇవ్వాలి.
ఎవరినీ ఆకలితో ఉండనివ్వవద్దు
గరుడ పురాణం ప్రకారం పితృ పక్షం సమయంలో పూర్వీకులు ఏ రూపంలోనైనా రావచ్చు. అటువంటి పరిస్థితిలో సర్వ పితృ అమావాస్య రోజున ఎవరైనా మీ ఇంటి ముందుకు ఆకలితో వచ్చి పిలిస్తే వారిని వెనక్కి పంపకూడదు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి.
పంచబలిని తీయండి
విశ్వాసాల ప్రకారం బ్రాహ్మణ విందు ముందు పంచబలిని తీయడం ఒక సంప్రదాయం. అంటే 5 రకాల జీవులకు ఆహారం తీసుకోవడం. పంచబలిలో మొదటి ఆహారం ఆవుకు, రెండవది కుక్కకు, మూడవది కాకికి, నాల్గవది దేవతకు, ఐదవది చీమలకు ఆహారం తీస్తారు.
దానధర్మాలు చేయండి
సర్వ పితృ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించి సంతతి వృద్ధికి అనుగ్రహిస్తారు. ఈ రోజున డబ్బు, వస్త్రాలు, ధాన్యాలు, నల్ల నువ్వులు ఎవరి శక్తి మేరకు దానం చేస్తారు.
అమావాస్య నాడు ఏమి చేయకూడదు
రాత్రిపూట శ్రాద్ధాహారాన్ని ఎప్పుడూ వడ్డించకూడదు. ఈ రోజున కుటుంబ సభ్యులు తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. అదే సమయంలో బ్రాహ్మణ విందులో బ్రాహ్మణులు, కుటుంబ సభ్యులు మౌనంగా ఉండాలి. అరటి ఆకుల్లో, స్టీలు పాత్రల్లో శ్రాద్ధాహారాన్ని వడ్డించకూడదు.
ఆకు, వెండి, రాగి, కంచుతో చేసిన పాత్రలలో ఆహారాన్ని అందించవచ్చు. గుర్తుంచుకోండి. శ్రాద్ధ ఖర్మలు అప్పు తీసుకుని చేయకూడదు. ఈ రోజున ఎవరినీ దూషించకూడదు, దూషించే పదాలు వాడకూడదు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.
టాపిక్