Indian temples: మోక్షాన్ని పొందాలంటే భారత్ లో ఉన్న ఈ 4 ఆలయాలు తప్పనిసరిగా సందర్శించాల్సిందే
Indian temples: ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత మోక్షం లభించాలని కోరుకుంటారు. అందుకోసం పూజలు, యజ్ఞాలు చేస్తారు. అయితే ఇవేమీ కాకుండా ఈ నాలుగు ఆలయాలలో ఒక్కటి దర్శించుకున్నా మీకు మోక్షం లభిస్తుంది.
Indian temples: జనన మరణ చక్రం నుంచి స్వేచ్ఛను ప్రసాదించే ముక్తి లేదా మోక్షాన్ని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మోక్షం లభించింది అంటే మరలా పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు.
చనిపోయిన తర్వాత వారి ఆత్మ దైవంతో ఐక్యమవుతుందని నమ్ముతారు. అందుకే మోక్షం ప్రసాదించమని ప్రతి ఒక్కరూ దేవుడిని వేడుకుంటారు. మోక్షాన్ని పొందడం మానవ జీవితానికి ఉన్న అంతిమ ఉద్దేశంగా పరిగణిస్తారు. అది శాశ్వతమైన శాంతి, ఆనందం, బాధల నుంచి విముక్తి ఇస్తుంది. మోక్షం కోసం పూజలు, యజ్ఞయాగాదులు చేస్తారు. వాటి వల్ల మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న ఈ నాలుగు ఆలయాలను సందర్శించినా మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. నాలుగు వేరువేరు దిశల్లో ఉన్న ఈ నాలుగు దేవాలయాలను సందర్శిస్తే భక్తులకు మోక్షం లభిస్తుంది.
ఉత్తరాన బద్రీనాథ్
ఉత్తరాఖండ్ లోని హిమాలయాల మధ్య బద్రీనాథ్ ఆలయం ఉంది. ఆరు నెలలకు ఒకసారి ఆలయం తలుపులు తెరుస్తారు. అక్షయ తృతీయ నుంచి అంటే మే 10 నుంచి ఈ ఆలయం తలుపులు భక్తుల సందర్శనార్థం తెరిచారు. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఇది ఒకటిగా పరిగణిస్తారు. ఈ జన్మలో మోక్షాన్ని పొందాలనుకునే వ్యక్తులు జీవితంలో కనీసం ఒక్కసారైనా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాలనుకుంటారు. ప్రపంచంలో నలు మూలల నుండి భక్తులు ఇక్కడకు వస్తారు. జోషి మఠ్ నుంచి ట్రేకింగ్ ద్వారా ఆలయానికి చేరుకోవాలి. పాపంతో నిండిన ఆత్మలను శుద్ధి చేసుకునేందుకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అందమైన ఈ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తులకు సాటి లేనిది.
పశ్చిమాన కృష్ణుడి ద్వారక
గుజరాత్ లో ఉన్న ద్వారకను కృష్ణ రాజ్యమని కూడా పిలుస్తారు. ద్వారక దేవాలయాన్ని ద్వారకాధీష్ మందిర్ అని కూడా ఉంటారు. కృష్ణుడికి అంకితం చేసిన దేవాలయం ఇది. ద్వారక చార్ ధామ్ లలో ఒకటి అని నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ద్వారకని సందర్శిస్తే ఇతర ధామ్ తో పాటు మోక్షాన్ని పొందుతారని దైవికంలో ఐక్యమవుతారని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం అయస్కాంత శక్తులను కలిగి ఉందని చెబుతారు. అందుకే భక్తులు ఇతర వస్తువులు శ్రీకృష్ణుడికి ఆకర్షితులు అవుతారని అంటారు
తూర్పున జగన్నాథ్ ఆలయం
ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ ప్రాంతంలో ఉన్న జగన్నాథ దేవాలయం సంస్కృతి, చరిత్ర, రహస్యాలతో కూడిన గొప్ప దేవాలయం. ఎవరైనా మోక్షాన్ని పొందాలని అనుకోకపోయినా కనీసం ఒక్కసారైనా ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటారు. జగన్నాథుడు, బలరాం, సుభద్రలకు అంకితం చేయబడిన ఆలయం. వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. జగన్నాథ రథయాత్ర తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. ఆలయ నిర్మాణ శైలి దాని చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తి ధ్యానం ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులను చేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తే మోక్షం లభిస్తుంది. మరు జన్మ అనేది ఉండదు.
దక్షిణాన రామేశ్వరం
భారతదేశంలోనే అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటి తమిళనాడులోని రామేశ్వరాలయం. శివునికి అంకితం చేసిన ఈ ఆలయం దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. యాత్రికులు రామేశ్వరాన్ని సందర్శిస్తూ పూర్వపాపాల నుంచి విముక్తిని మోక్షాన్ని పొందాలని కోరుకుంటారు. హిందూ మహాసముద్రానికి దగ్గరగా ఉన్న రామేశ్వరాలయం శాంతి, ప్రశాంతతను ఇస్తుంది. ప్రజలు దైవానికి దగ్గరవుతారు. చనిపోయేలోపు ఒకసారైనా రామేశ్వరాన్ని సందర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం.