పూరీ జగన్నాథుడి వంట గది వైభవం నైవేద్యాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు
కలియుగ దైవము పూరీ జగన్నాథుడి వంట గది వైభవం తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని గురించిన వివరాలను ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
మన సనాతన ధర్మంలో సాల గణనలో యుగాలకు ప్రత్యేకత ఉన్నది. ప్రతీ యుగానికి ఒక దైవ దేవ ప్రాధాన్యత ఉన్నట్లుగా సనాతన ధర్మం చెప్పిందని అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భారతదేశంలో నాలుగు ముఖ్యమైన ధామములు ఉన్నాయి. కృతయుగానికి చిహ్నంగా ధామము బదరీ ధామము (బదరీనాథ మందిరం), త్రేతాయుగానికి చిహ్నంగా రామేశ్వర ధామము, ద్వాపర యుగానికి చిహ్నంగా ద్వాపర ధామము, అలాగే కలి యుగానికి చిహ్నంగా పూరీ జగన్నాథ ధామము. ఇది తప్పక దర్శించవలసిన క్షేత్రమని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ కలియుగంలో పూరీ జగన్నాథున్ని దర్శించినటువంటి వారికి స్వామి అనుగ్రహము లఖించి కోరికలన్నీ నెరవేరుతాయని జగన్నాథుని యొక్క స్థలపూరాణం తెలియచేస్తోందని చిలకమర్తి వివరించారు. పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడిని ఆరాధిస్తారు. స్వామివారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం.
పూరి వంటగది అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. ఇక్కడ 500 మంది వంటవారు. 300 మంది సహాయకులు ఉంటారు. 700 మట్టి కుండలతో వంటలు చేస్తారు. ఆచారాల సమయంలో 6000 మంది పూజారులు ఉంటారు. 172 సంవత్సరాల పురాతనమైన ఈ అలయంలోని ఎకరంలో విస్తరించి ఉన్న 82 గదులు ఈ విశాలమైన వంట గదిలో (150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు) భాగంగా ఉంటాయి. 752 చుల్దాలను దేవతకు అర్చించే మహాప్రసాద్‌ను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నైవేద్యాలు మాతా లక్ష్మి పర్యవేక్షణలో మాత్రమే చేస్తారని విశ్వాసం. ఈ వంట గది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అంటారు. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది. ఆహారం పూర్తిగా శాఖాహారం. ఆలయంలో బంగాళా దుంపలు, టమోటాలు, కాలీఫ్లవర్ ఉపయోగించరు. ఇక్కడ తయారుచేసిన వంటకాలకు “జగన్నాథ్ వల్లభ్ లద్దు, 'మఠపులి” అని పేరు పెట్టారు.
భోగ్ (నైవేద్యం)లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడటం నిషేధం. వంటగది దగ్గర రెండు బావులు ఉన్నాయి, వీటిని గంగా, యమునా అని పిలుస్తారు. వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే భోగ్ తయారవుతుంది. ఈ వంటగదిలో 56 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. మహా ప్రసాద్ కాయధాన్యాలు, బియ్యం, కూరగాయలు, తీపి పూరి, ఖాజా, లడ్డూ, పేడా, బూంది, కార, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిస్రి మొదలైన వాటి నుండి తయారవుతుంది. రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. ఎనిమిది లక్షల లడ్డూలు తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నిస్ పుస్తకంలో కూడా నమోదైంది.
వంటగదిలో ఒకేసారి 50 వేల మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు. ఆలయ వంటగదిలో ప్రతిరోజూ డెబ్బై రెండు క్వింటాళ్ల బియ్యం ఉడికిస్తారు. ప్రసాదం చేయడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు. తరువాత ప్రసాదం కింది నుండి ఒకదాని తరువాత ఒకటి వండుతారు. ప్రతిరోజూ కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు. అన్నింటిలో మొదటిది, భోగ్‌ను భగవంతునికి అర్చించిన తరువాత, ప్రసాదం భక్తులకు పంచుతారు.
జగన్నాథ్‌కు “అబ్బా’’ అని పిలిచే మహాప్రసాద్‌ను అర్చించిన తరువాత, దీనిని తల్లి బీమలకు అర్చిస్తారు. అప్పుడు ఆ ప్రసాద్ మహాప్రసాద్ అవుతుంది. మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామికి రోజుకు ఆరుసార్లు అర్చిస్తారు. రథయాత్ర రోజున, ఒక లక్ష పద్నాలుగు వేల మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. ఆచారాలలో 6000 మంది పూజారులు పనిచేస్తున్నారు. ఒడిశాలో జరిగే పది రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల ప్రజలు ఉత్సాహంతో వస్తారు. ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు, కులం, మతం అనే వివక్ష లేదు.
జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలు
- అన్నం
- కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)
- దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)
- ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)
- తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
- నేతి అన్నం
- కిచిడీ
- మిఠా పొఖాళా (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)
- ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)
- కాజా
- గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)
- లడ్డు
- మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)
- మేడ జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)
- వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)
- ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)
17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)
19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)
21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
23. యమిులి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
27. పూరీ
28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)
30. దొహిబొరా (పెరుగు గారెలు)
31. అరిసె
32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు)
34. ఖిరి (పాయసం)
35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)
36. కోవా
37. రాసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)
38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)
39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)
40. బఐపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)
41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)
43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు)
44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం)
45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు)
46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం)
47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)
48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)
49. బేసౌరా (కలగూర వంటకం)
50. సగొ (తోటకూర వంటకం)
51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర)
52. గొటి బైగొణా (గుత్తివంకాయ కూర)
53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)
54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)
55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె)
56. బైగని (వంకాయలతో చేసే వంటకం).
స్వామివారికి 56 రకాల పిండి వంటలను నివేదిస్తారని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.