Akshaya tritiya 2024: అక్షయ పాత్ర ఎవరు ఎవరికి ఇచ్చారో తెలుసా? అక్షయ తృతీయ పుణ్యఫలం దక్కాలంటే ఏం చేయాలి?-do you know who gave the role of akshaya to whom what should be done to get the reward of akshaya tritiya ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: అక్షయ పాత్ర ఎవరు ఎవరికి ఇచ్చారో తెలుసా? అక్షయ తృతీయ పుణ్యఫలం దక్కాలంటే ఏం చేయాలి?

Akshaya tritiya 2024: అక్షయ పాత్ర ఎవరు ఎవరికి ఇచ్చారో తెలుసా? అక్షయ తృతీయ పుణ్యఫలం దక్కాలంటే ఏం చేయాలి?

HT Telugu Desk HT Telugu
May 10, 2024 06:29 AM IST

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

అక్షయ తృతీయ 2024
అక్షయ తృతీయ 2024 (Freepik)

Akshaya tritiya 2024: జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసుకుంటే ఆ శుభకార్యాలు దివ్యమైన ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున మంచి పనులను ఆచరిస్తారు. ఈ రోజు దానములు చేయడం, వ్రతాలు చేసుకోడం ,శుభ కార్యాలు ఆచరించడం వలన ఆ పనులు అక్షయం అవుతాయన్న నమ్మకం. అక్షయతృతీయ రోజున వర్జ్యం, రాహుకాలంతో పనిలేదు. మత్స్యపురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు.

అక్షయ తృతీయ పుణ్యం దక్కాలంటే ఏం చేయాలి?

వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది. పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే, ఈ రోజు పాప కార్యాలు చేస్తే పాప కార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్యకర్మ ఆచరించినా అక్షయంగా ఫలం లభిస్తుంది.

అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని చిలకమర్తి తెలిపారు. పండితులు పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచికార్యాలను ఈరోజున చేయవచ్చు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని భర్తుల విశ్వాసం. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద, పుణ్యఫలం అక్షయంగా ప్రాప్తిస్తాయని చిలకమర్తి తెలిపారు.

అక్షయ తృతీయ నాడు చాలా ప్రాముఖ్యతలున్నాయి. పరశురాముని జన్మదినం. పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం. త్రేతాయుగం మొదలైన దినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన దినం. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు “అక్షయపాత్ర” ఇచ్చిన దినం.

శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించారు. ఆదిశంకరులు “కనకధార స్తోత్రం” చెప్పిన దినం. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ద్రౌపదిని కృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం ఇలా అక్షర తృతీయ నాడు చాలా ప్రాముఖ్యతలున్నాయిని చిలకమర్తి తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner