Lakshmi Narayan Yogam : దీపావళి తర్వాత.. ఆ మూడు రాశుల వారికి లక్ కలిసివస్తుంది..-three zodiacs have good luck with the effect of lakshmi narayan yog after deepavali ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Narayan Yogam : దీపావళి తర్వాత.. ఆ మూడు రాశుల వారికి లక్ కలిసివస్తుంది..

Lakshmi Narayan Yogam : దీపావళి తర్వాత.. ఆ మూడు రాశుల వారికి లక్ కలిసివస్తుంది..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 13, 2022 03:00 PM IST

Lakshmi Narayan Yog : బుధుడు, శుక్రుడు ఒకేరాశిలో ఉంటే.. దానిని లక్ష్మీ నారాయణ యోగం అంటారు. ఈ లక్ష్మీ నారాయణ యోగాన్ని చాలా అరుదైనదిగా పరిగణిస్తారు. దీపావళి తర్వాత లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీనివల్ల పలు రాశిచక్రాలు వారికి లక్ కలిసి వస్తుంది. మరి ఆ రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ నారాయణ యోగం
లక్ష్మీ నారాయణ యోగం

Lakshmi Narayan Yog : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం వస్తుంది. ఆ యోగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అక్టోబర్ 26 నుంచి తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీపావళి తర్వాత తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం ఫలితంగా పలు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రాశుల జాబితాలో ఉన్నారో లేదో చూసుకోండి.

కన్యారాశి

లక్ష్మీనారాయణ యోగం వల్ల కన్యా రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఫలితంగా ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారు భారీ లాభాలను పొందుతారు. ముఖ్యంగా విదేశీ వ్యాపార సంబంధాలు ఉన్న వారికి ఎక్కువ లాభం చేకూరుతుంది. కెరీర్ మెరుగుపడుతుంది. పనికి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

ధనుస్సు

లక్ష్మీ నారాయణ యోగం ధనుస్సు రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే.. మీరు అందులో విజయం సాధిస్తారు. గొప్ప రాబడిని పొందుతారు. అయితే కొన్ని విషయాల్లో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు శుభవార్తలు వింటారు. పనిలో విజయం పొందుతారు. మీకు సీనియర్ల మద్దతు లభిస్తుంది.

మకరం

లక్ష్మీ నారాయణ యోగం వల్ల మకర రాశివారికి ఆర్థికంగా లాభాలు చేకూరతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు మీకు తిరిగి వస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా మీరు కొత్త శిఖరానికి చేరుకుంటారు. కార్యాలయంలో సీనియర్ల ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా అభివృద్ధి మార్గం విస్తృతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం