Laxmi Narayan Yogam : ఆ రాశుల వారికి లక్ష్మీ నారాయణ యోగం.. బాగా కలిసి వస్తుంది..
బుధుడు, శుక్రుడు ఒకేరాశిలో ఉంటే.. దానిని లక్ష్మీ నారాయణ యోగం అంటారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ లక్ష్మీ నారాయణ యోగాన్ని చాలా అరుదైనదిగా పరిగణిస్తారు. మరి జూలై నెలలో ఈ యోగం ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Laxmi Narayan Yog : లక్ష్మీ నారాయణ యోగం ఏ రాశివారిపై ప్రభావం చూపుతుందో వారికి అదృష్టం, డబ్బు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. జూలై మొత్తం వారికి లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తుంది. ఈసారి లక్ష్మీ నారాయణ యోగం ఒకటి కంటే ఎక్కువ రాశులకు ప్రయోజనం చేకూరుస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ సమయంలో బుధుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ క్రమంలో ఏ రాశులు ప్రయోజనం పొందబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి
అయితే చాలా విషయాలు గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి. జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు.. ఈ గ్రహాల మూమెంట్స్‌ని బాగా నమ్ముతారు. ఈ క్రమంలో జూలై నెలలో మిథునరాశిలో రెండు రాశులు ఉంటున్నాయి. జూలై 2న బుధుడు మిథునరాశిలోకి రాగా.. జూలై 13న శుక్రుడు ప్రవేశించనున్నాడు.
ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మిథున రాశివారికి లక్ష్మీ నారాయణ యోగం ఉండబోతోందని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఈ యోగం వల్ల ఐశ్వర్యం, ఆస్తులు, తేజస్సు పరంగా చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే సంపద పరంగా ఈ ప్రయోజనం ఎక్కువ కాలం ఉండదు. ఈ యోగం జూలై 13 నుంచి 18 వరకు మాత్రమే ఉంటుంది. జూలై 18 తర్వాత శుక్రుడు, జూలై 31న బుధుడు మిథున రాశి నుంచి వేరే రాశిలోకి ప్రవేశించనున్నారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వారికి లక్ష్మీ నారాయణ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకు జూలైలో ఈ యోగం వల్ల ప్రత్యేక ప్రయోజనం కలుగనుంది. సింహ రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగ ప్రభావం వల్ల వ్యాపారం మెరుగుపడుతుంది. అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
తులా రాశి
జూలై 13 నుంచి జూలై 18 వరకు తులా రాశి వారికి చాలా మంచిది. ఈ కాలంలో తులారాశి వారు అనేక శుభవార్తలు వింటారు. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవైతే.. మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాల్లో భారీ మెరుగుదల కనిపిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారిపై కూడా లక్ష్మీ నారాయణ యోగం ప్రభావం ఉంటుంది. చాలా కాలంగా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే.. ఆ సమస్య తొలగిపోతుంది.
సంబంధిత కథనం