Saturn transit: 2025లో ఈ రాశులు శని గుప్పిట్లో ఉంటాయి, ఏలినాటి శని ఎవరికి మొదలవుతుందంటే-these zodiac signs will be under the control of saturn in 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: 2025లో ఈ రాశులు శని గుప్పిట్లో ఉంటాయి, ఏలినాటి శని ఎవరికి మొదలవుతుందంటే

Saturn transit: 2025లో ఈ రాశులు శని గుప్పిట్లో ఉంటాయి, ఏలినాటి శని ఎవరికి మొదలవుతుందంటే

Gunti Soundarya HT Telugu
Aug 21, 2024 01:16 PM IST

Saturn transit: 2024 శని సంవత్సరంగా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలో ఉంటున్నాడు. వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకుంటాడు. 2025 లో శని రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల మీద శని ప్రభావం ఉంటుంది. అలాగే 2025 నుంచి ఏలినాటి శని మీన రాశి వారికి మొదలవుతుంది.

2025 లో ఈ రాశులపై శని కన్ను
2025 లో ఈ రాశులపై శని కన్ను

Saturn transit: శని ఈ సంవత్సరం 2024 తన రాశిని మార్చలేదు. కానీ 2025 సంవత్సరంలో శని తన రాశిని మారుస్తుంది. అలాగే తిరోగమన దశలోనూ సంచరిస్తుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉన్నాడు. 

శని రాశి మారడం వల్ల దీని నుంచి వచ్చే ఏలినాటి శని(సడే సతీ), అర్థాష్టమ శని( దయ్యా) ప్రభావం సమీకరణాలు కూడా మారిపోతాయి. 2025లో శని మీన రాశి ప్రవేశం చేస్తాడు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ మార్పుతో శని మీన రాశిని కూడా నియంత్రిస్తుంది. శనిగ్రహం ఏలినాటి శని మొదటి దశ ఈ రాశిపై ప్రారంభమవుతుంది. దీని నుండి బయటపడాలంటే మీన రాశి వాళ్ళు చాలా కాలం వేచి ఉండాలి. ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. అలా మీన రాశికి సడే సతీ నుంచి 2030 లో విముక్తి లభిస్తుంది. 

ఈ కాలంలో ఏ రాశుల వారికి శని సడే సతి ప్రారంభమవుతుంది? ఏ రాశులు శని అధీనంలోకి వెళతాయి? శని ఏ రాశిలో సడే సతీ స్థితిని తీసుకువస్తుంది? ఏ రాశిలో శని దయ్యా ఉంటుందో తెలుసుకుందాం. 

శని రాశి మార్పు 

2023లో శనిగ్రహం కుంభ రాశి నియంత్రణలో ఉంది. శనిగ్రహం జనవరి 17, 2023న కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. వచ్చే ఏడాది అంటే 2025 లో శని కుంభ రాశిని వీడి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశిలో శని ఉండటం వల్ల సడే సతి మకరం, కుంభ రాశులపై ఉంది. ఇది కాకుండా కర్కాటకం, వృశ్చికం రాశుల మీద అర్థాష్టమ శని ప్రభావం ఉంది.

వీరికి శని నుంచి విముక్తి 

శని మీన రాశికి వెళ్ళడం వల్ల మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి వచ్చే ఏడాది విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం మకర రాశిలో సడే సతి చివరి దశ కొనసాగుతోంది. మరో ఏడు నెలల పాటు ఇది ఉంటుంది. 2017 నుండి 2025 వరకు ప్రయాణం ఈ రాశికి హెచ్చు తగ్గులలో ఒకటి. ఇప్పుడు బృహస్పతికి చెందిన మీన రాశిలోకి శని రాకతో ఈ రాశి వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి. ఇక కుంభ రాశి వారికి కూడా ఏలినాటి శని 2028లో మోక్షం కలుగుతుంది.

కుంభ రాశి వారికి ఫిబ్రవరి 2028లో శని గ్రహం నుండి విముక్తి లభిస్తుంది. ఇది కాకుండా 2025 సంవత్సరం నుండి మేష రాశిలో కూడా శనిగ్రహ సడేసతి ప్రారంభమవుతుంది. ఇది మే 2032 వరకు కొనసాగుతుంది. సింహం, ధనుస్సు రాశుల వారికి వచ్చే ఏడాది నుంచి అర్థాష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది ఈ రెండు రాశుల మీద రెండున్నర సంవత్సరాల పాటు ప్రభావం చూపిస్తుంది. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner