Saturn transit: 2025 లో మీన రాశిలోకి శని.. రెండున్నర సంవత్సరాలు ఈ రాశులకు అద్భుతమే-saturn will change its movement in 2025 the fortunes of these 3 zodiac signs will shine for two and a half years ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: 2025 లో మీన రాశిలోకి శని.. రెండున్నర సంవత్సరాలు ఈ రాశులకు అద్భుతమే

Saturn transit: 2025 లో మీన రాశిలోకి శని.. రెండున్నర సంవత్సరాలు ఈ రాశులకు అద్భుతమే

Gunti Soundarya HT Telugu

Saturn transit: వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకోబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుంది. రెండున్నర సంవత్సరాల పాటు శని ఆశీస్సులు ఈ రాశుల వారికి పుష్కలంగా లభిస్తాయి.

మీన రాశిలోకి శని

Saturn transit: జ్యోతిషశాస్త్రంలో శనిని కర్మ దేవుడు లేదా న్యాయదేవుడు అంటారు. తొమ్మిది గ్రహాలలో శని చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. శనిగ్రహం దాదాపు రెండున్నర సంవత్సరాలలో ఒక రాశి నుండి మరొక రాశికి చేరుతుంది.

శని గ్రహం 2023 జనవరిలో తన స్వంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ నుంచి ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటాడు. మార్చి 29, 2025న శనిగ్రహం కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. మీన రాశిలో శని సంచరించడం వల్ల మేష రాశి వారికి శని సడే సతి ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి సడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీన రాశిలో శని సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పడుతుందో చూసేయండి.

మకర రాశి

ఏలినాటి శని మూడు దశలలో ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. శని సంచరిస్తున్న రాశికి ముందు, వెనుక ఉన్న రాశుల మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దీన్ని సడే సతీ అంటారు. ప్రస్తుతం మకర రాశి వారికి శని గ్రహం ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది. శని మీనంలోకి ప్రవేశించిన వెంటనే మకర రాశి వారికి సడే సతి నుండి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిగ్రహం కోపం తొలగిపోయిన వెంటనే సానుకూల ఫలితాలు పొందుతారు. మీకు ఉద్యోగం, వృత్తికి సంబంధించిన కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు సృష్టించబడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి మీన రాశిలో శని సంచారం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందవచ్చు. సామాజిక గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీరు మీ లక్ష్యాలలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శని మీన రాశిలోకి ప్రవేశించిన వెంటనే శని దయ్యా నుంచి విముక్తి లభిస్తుంది. దీన్నే అర్థాష్టమ శని అంటారు. ఇది రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. రెండున్నరేళ్ల తర్వాత వృశ్చిక రాశికి శనిగ్రహం దుష్ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. శనిగ్రహం అశుభ ప్రభావం తొలగిపోవడంతో మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. మీరు మతపరమైన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలనే కొందరి కల నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. దీని కారణంగా మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.