Rahu venus conjunction: రాహు, శుక్ర కలయిక.. మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు కనక వర్షమే-rahu venus conjunction in meena rashi create malavya rajayogm these zodiac signs get money rain ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Venus Conjunction: రాహు, శుక్ర కలయిక.. మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు కనక వర్షమే

Rahu venus conjunction: రాహు, శుక్ర కలయిక.. మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు కనక వర్షమే

Gunti Soundarya HT Telugu
Mar 30, 2024 11:00 AM IST

Rahu venus conjunction: దాదాపు 12 సంవత్సరాల తర్వాత రాహువు, శుక్రుడు కలయిక జరగబోతుంది. ఫలితంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి.

రాహు శుక్ర కలయికతో మాలవ్య రాజయోగం
రాహు శుక్ర కలయికతో మాలవ్య రాజయోగం

Rahu venus conjunction: జ్యోతిష్య లెక్కల ప్రకారం మార్చి నెల చివరి రోజు అంటే 31వ తేదీన సంపద, సంతోషం, శ్రేయస్సు ప్రసాదించే శుక్రుడు మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ రాహు గ్రహం ఇప్పటికే ఉంది. జాతకంలో రాహువు శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడతాడు. సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మార్చి 31న శుక్రుడు, రాహువు కలసి కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు.

సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. శుక్ర రాహు గ్రహాల సంయోగం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. రాహు శుక్ర కలయిక ఏప్రిల్ 24వరకు ఉంటుంది. మీన రాశి శుక్రుడు మహోన్నత రాశి. వృషభం, తుల, మీన రాశులలో శుక్రుడు సంచరించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో ఏయే రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం. 

మిథున రాశి 

మాలవ్య రాజయోగం మిథున రాశి వారి పురోభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు కలిగిస్తుంది. ఉద్యోగంలో,  వ్యాపారంలో మీకు అదృష్టం మద్దతుగా ఉంటుంది. డబ్బు సంపాదించేందుకు నూతన ఆదాయ మార్గాలు ఎదురవుతాయి. శుక్రుడి శుభ ప్రభావంతో జీవితం విలాసవంతంగా గడుపుతారు. 

కర్కాటక రాశి 

కర్కాటక రాశి తొమ్మిదవ ఇంట్లో రాహు, శుక్ర కలయిక జరుగుతుంది. ఈ సంయోగం ఎంతో మేలు చేస్తుంది. అదృష్టం పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో జీతం పెరుగుదల కనిపిస్తుంది. ఆకస్మిక ఆర్టిక లాభాలతో పాటు వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. 

సింహ రాశి

 సింహరాశి పదో ఇంట్లో శుక్ర, రాహువు కలయిక అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వైవాహక జీవితం సామరస్యంగా ఉంటుంది. పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు. వ్యాపార ప్రయత్నాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. 

కన్యా రాశి

కన్యా రాశి ఏడో ఇంట్లో ఈ సంయోగం జరుగుతుంది. ఫలితంగా జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందుతాయి. లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. వృత్తిపరమైన పురోగతికి అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. అనేక ఆదాయ మార్గాల ద్వారా మీకు ఊహించని ధనం లభిస్తుంది. వ్యాపారం విస్తరించుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారి జాతకంలో ఈ రెండు గ్రహాల కలయిక శుభ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాలు పెరుగుదలకు దారి తీసే పరిస్థితిలో ఉంటాయి. అన్ని పనుల్లోనూ ఆశించిన విజయం సాధిస్తారు. జీవితంలోని ప్రతి అంశంలో సానుకూల మార్పులు ఉంటాయి. 

మీన రాశి

మీన రాశిలోనే ఈ మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. సంపదని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.