Malavya raja yogam: శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది
Malavya raja yogam: సంపదని ఇచ్చే శుక్రుడు త్వరలో రాశి చక్రం మారబోతున్నాడు. ఫలితంగా మాలవ్య రాజయోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో మూడు రాశుల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది.
Malavya raja yogam: జీవితంలోని వివిధ విషయాలను ప్రభావితం చేసే గ్రహాలలో శుక్ర గ్రహం ఒకటి. ప్రేమ, అందం, సామరస్యం, ఆనందం, సంబంధాలు, సంపద, సృజనాత్మకత, కోరికలు వంటి వాటికి శుక్రుడు కారకుడిగా ఉంటాడు. ఈ గ్రహ సంచారం ఆర్థిక విషయాలు, ప్రేమానుబంధాల మీద ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక శ్రేయస్సును తీసుకొస్తుంది. శుక్రుడు శుభ స్థానంలో ఉంటే వ్యక్తికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అది వ్యక్తి జీవితం వివిధ ప్రభావాలను చూపిస్తుంది. ఒక రాశి చక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల సంయోగం కూడా జరుగుతుంది. ఈ సమయంలో శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని తీసుకొనిరాబోతున్నాడు.
జ్యోతిష్య శాస్త్రంలో మాలవ్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది పంచ మహా పురుష యోగాలలో ఒకటి. ఈ యోగం జాతకంలో ఉంటే అతనికి సంపద, కీర్తి, విజయం లభిస్తుంది. మాలవ్య రాజయోగం వల్ల మూడు రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది.
ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శుక్రుడు మార్చి 31న మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలో ప్రవేశించిన వెంటనే మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. మీన రాశిలో ఇప్పటికే సూర్యుడు, రాహువు సంచరిస్తున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనితో పాటు మాలవ్య రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి మాలవ్య రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శుక్రుని సంచారం ఈ రాశి వారికి ఒక వరం. పని లేదా వ్యాపారానికి సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ వనరులు మెరుగుపడతాయి. పొదుపు చేయగలుగుతారు. శుక్రుని సానుకూల ప్రభావం వల్ల లాభాలు గడిస్తారు. సినిమా, వైద్యం, కళ, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో అనుబంధం ఉన్న జాతకులు గొప్ప ఫలితాలు పొందుతారు. లావాదేవీలు, పెట్టుబడులు లాభసాటిగా సాగుతాయి. ధనలాభం పొందుతారు.
కన్యా రాశి
మాలవ్య రాజయోగం కన్యా రాశి వారికి అత్యంత ఫలవంతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితంలోకి భాగస్వామి వస్తుంది. ఈ రాశి జాతకులు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ప్రయోజనాల పొందుతారు. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి మాలవ్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి నాలుగో ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని రకాల భౌతిక సౌకర్యాలు, విలాసాలు పొందుతారు. వాహనం లేదా భూములు కొనుగోలు చేస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా ఇది ఉత్తమమైన సమయం.