Maha shivaratri 2024: మహా శివరాత్రి రోజు ఈ పువ్వులతో శివుడిని పూజించండి.. మీ ఇంట సిరిసంపదలు నెలకొంటాయి
Maha shivaratri 2024: సృష్టికర్తని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూలతో మహా శివరాత్రి పూజ చేయండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. శివుడి ఆశీస్సులు లభిస్తాయి.
Maha shivaratri 2024: సనాతన ధర్మంలో మహా శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివుడు పార్వతీ దేవిని వివాహమాడింది ఈరోజేనని నమ్ముతారు. శివరాత్రి ఉపవాసం, పూజ, జాగారానికి విశిష్టత ఉంది. శివుని అనుగ్రహం కోసం మహా శివరాత్రి రోజు భక్తులు పూజలు చేస్తారు.
శివ పురాణం ప్రకారం భోలేనాథుడు ఆశీర్వాదాలు పొందటానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి.. మహా శివరాత్రి రోజున కొన్ని పుష్పాలతో పూజ చేయడం మంచిది. శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వల్ల భోళా శంకరుడు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీ కోరికలు నెరవేరతాయి. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8న జరుపుకొనున్నారు.
మల్లె పువ్వు
హిందూ మతంలో ప్రేమ, స్వచ్చతకు సూచనగా మల్లెపువ్వుని భావిస్తారు. వాహనం కొనుగోలు చేయాలని ఆశపడుతున్న వాళ్ళు శివుడికి ఈ పూలు సమర్పించవచ్చు. మీరు ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయా? అయితే శివరాత్రి రోజు శివుడికి మల్లెపువ్వులు సమర్పించండి. మీ కోరికలు నెరవేరతాయి.
అవిసె పువ్వు
దీన్ని అల్సీ పువ్వు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి నాడు ఈ పువ్వుని శివుడికి సమర్పిస్తే ఆయన ఆశీస్సులు పొందుతారు. శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మిగులుతారు. విష్ణువు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి.
జుహీ పువ్వులు
ఆర్థిక సంక్షోభం, ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే మీరు మహా శివరాత్రి రోజు జుహి పువ్వులు సమర్పించాలి. ఈ పూలతో పూజిస్తే వారికి డబ్బు కొరత ఉండదు. ఆ ఇంటి సిరిసంపదలు తులతూగుతాయి. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శ్రేయస్సు పొందుతారు.
మందారం
శివుడికి ఎరుపు, తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే వీటిని సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. సంతోషకరమైన జీవితం లభిస్తుంది.
ఉమ్మెత్త పువ్వు
శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది. శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వల్ల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ ఉమ్మెత్త పూలు సమర్పించండి. వెంటనే తీరిపోతుంది.
గులాబీ పూలు
శివరాత్రి రోజున శివుడికి గులాబీ పువ్వులు సమర్పించాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
తామర పువ్వు
శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు. ఈ పూలు పూజలో ఉపయోగించడం వల్ల శివుడి ఆశీర్వదాలు, మోక్షం పొందుతారని విశ్వసిస్తారు.
తెల్ల జిల్లేడు
మహా శివరాత్రి రోజు తెల్ల జిల్లేడు పూలతో శివుడిని ఆరాధిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా చేసిన పాపాలు తొలగిపోతాయి.