Nirjala ekadashi 2024: నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు, దానం చేయాల్సిన వస్తువులు ఇవే-nirjala ekadashi fasting rules and which things to donate ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nirjala Ekadashi 2024: నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు, దానం చేయాల్సిన వస్తువులు ఇవే

Nirjala ekadashi 2024: నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు, దానం చేయాల్సిన వస్తువులు ఇవే

Gunti Soundarya HT Telugu
Jun 15, 2024 11:00 AM IST

Nirjala ekadashi 2024: 24 ఏకాదశులలో అత్యంత కష్టమైనది నిర్జల ఏకాదశి. ఈ ఏడాది జూన్ 18వ తేదీ వచ్చింది. ఈ ఏకాదశి రోజు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరిస్తారు. ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? దానం చేయాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు
నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు (pinterest(vishnu arts))

Nirjala ekadashi 2024: అన్నీ ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది, ప్రత్యేకమైనది నిర్జల ఏకాదశి. ఈరోజు ఏకాదశి జూన్ 18వ తేదీ వచ్చింది. నిర్జల ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించడం ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసం అన్ని ఏకాదశులలో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు.

ఈ సంవత్సరం ఈ ఉపవాసం జూన్ 18న ఆచరిస్తారు, కొంతమంది జూన్ 17న నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు. కానీ ఉదయ తిథి ప్రకారం జూన్ 18న ఉపవాసం ఉండటం మంచిది. ఈ రోజున నీరు లేకుండా ఉండి, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమం నీరు తాగకుండా ఉండటమే. లక్ష్మీసమేత విష్ణుమూర్తిని ఆరాధించాలి.

ఉపవాసం ఉండి పేదలకు, అవసరంలో ఉన్న వారికి దానధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. నిర్జల ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది. ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకుని భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారు. చతుర్ధశి అమావాస్య సూర్యగ్రహణం సమయంలో శ్రాద్ధం చేయడం ద్వారా ఎటువంటి ఫలితం దక్కుతుందో ఈ కథ వినడం ద్వారా కూడా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఉపవాస సమయంలో ఏయే నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకుందాం.

ఆచారించాల్సిన నియమాలు

ఏకాదశి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస నియమాలను పాటించాలి. కానీ ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఏకాదశి రోజున అన్నం, పప్పులు, బెండకాయలు, ముల్లంగి, శనగలు తినకూడదు.

ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి అన్నీ తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు, రోజంతా తక్కువ మాట్లాడాలి. వీలైతే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. అబద్ధాలు చెప్పకూడదు. కోపం తెచ్చుకోకండి, ఇతరులతో వాదించకండి. రాత్రి పూట విష్ణువు స్తోత్రాలు జపించాలి. ఏకాదశి ఉపవాస సమయంలో నీరు త్రాగడం నిషేధించబడింది. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు. అవసరమైతే మీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు, పండ్లు తినవచ్చు. ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు. శుద్ధి సమయంలో మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు ఆచమనం తప్ప నీరు త్రాగకూడదు.

నిర్జల ఏకాదశి నాడు ఏయే వస్తువులు దానం చేయాలి?

నిర్జల ఏకాదశి రోజున అన్నం, వస్త్రాలు, గోవు, నీరు, మంచం, గొడుగు దానం చేయాలి. కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండిన కుండ దానం చేయడం ఉత్తమం. మంచి, యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం కూడా మంచిది.

Whats_app_banner