ఏప్రిల్ 26, నేటి రాశి ఫలాలు.. వీరు పంచదార, వెన్న కలిపి బాలకృష్ణుడికి నివేదించాలి-daily horoscope april 26th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 26, నేటి రాశి ఫలాలు.. వీరు పంచదార, వెన్న కలిపి బాలకృష్ణుడికి నివేదించాలి

ఏప్రిల్ 26, నేటి రాశి ఫలాలు.. వీరు పంచదార, వెన్న కలిపి బాలకృష్ణుడికి నివేదించాలి

HT Telugu Desk HT Telugu
Apr 26, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ26.04.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 26వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 26వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.04. 2024

వారం: శుక్రవారం, తిథి : విదియ,

నక్షత్రం : అనూరాధ, మాసం : చైత్రం

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు బేకరీ, స్వీట్స్‌, పండ్ల వ్యాపారులకు అనుకూలంగా ఉన్నది. ఆకస్మిక సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. స్త్రీల రచనలు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందచేస్తారు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను గుర్తిస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరగలదు. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. మార్కెట్‌ రంగాల వారికి, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు సమావేశాలు, విందులలో పాల్గొంటారు. దూరప్రయాణాలలో అనుకూలత, కొత్త అనుభవానికి లోనవుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పండ్ల వ్యాపారులకు అనుకూలం. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా వ్యవహరించండి. విద్యార్థులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులెదురైనా రావలసిన ధనం అందటంతో కుదుటపడతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కష్టసమయంలో అయిన వారికి అండగా ఉంటారు. మీ భాగస్వామి వైఖరి మరింత చికాకుపరుస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్‌ వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయజాలవు. మొండి బాకీలు వసూలు కాగలవు. మీ ప్రమేయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. పత్రికా, పారిశ్రామిక సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అరియర్స్‌ మంజూరవుతాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయులతో కలసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. నిద్రలేమి, మానసిక ప్రశాంతత లేకపోవుట. ఖర్చులు అధికమగును. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. మీ ఆలోచనలను నీరు గార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. మొహమాటాలకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. వ్యవహారాలలో ఖచ్చితంగా వ్యవహరించాలి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార, వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు మీ స్తోమతకు తగినట్టే ఉంటాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel