Gajakesari raja yogam: 12 ఏళ్ల తర్వాత గజకేసరి రాజయోగం.. జూన్ 14 ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం-after 12 years gaja kesari raja yogam form in kanya rasi these three zodiac sign get money benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gajakesari Raja Yogam: 12 ఏళ్ల తర్వాత గజకేసరి రాజయోగం.. జూన్ 14 ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం

Gajakesari raja yogam: 12 ఏళ్ల తర్వాత గజకేసరి రాజయోగం.. జూన్ 14 ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం

Gunti Soundarya HT Telugu
Jun 13, 2024 12:49 PM IST

Gajakesari raja yogam: సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత కన్యా రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జూన్ 14న ఏర్పడబోయే ఈ యోగం ఫలితంగా మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయి.

12 ఏళ్ల తర్వాత గజకేసరి రాజయోగం
12 ఏళ్ల తర్వాత గజకేసరి రాజయోగం (pinterest)

Gajakesari raja yogam: సంపద, సంతోషాలకు కారకుడైన దేవ గురువు బృహస్పతి, మనసుకు కారకుడైన చంద్రుడు ఒకే రాశిలో కూర్చున్నప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమార్పు 12 సంవత్సరాల తర్వాత జూన్ 14న కన్యా రాశిలో బృహస్పతి, చంద్రుల కలయిక కారణంగా గజకేసరి రాజయోగం వస్తుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రుడు జూన్ 14న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అత్యంత వేగంగా రాశి చక్రాన్ని చంద్రుడు మార్చుకుంటాడు. రెండున్నర రోజుల పాటు చంద్రుడు ఒక రాశిలో ఉంటాడు. బృహస్పతి ఐదవ అంశం చంద్రునిపై పడటం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాజయోగం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు.

చంద్రుడు ఒక రాశి చక్రంలో సంచరించి బృహస్పతి శుభ దర్శనం ఆ రాశిలో పడితే గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జాతకంలో ఈ యోగం ఉంటే శత్రువులపై విజయం సాధించగలుగుతారు. జీవితంలో ఎలాంటి సవాలును అయినా అధిగమించగలుగుతారు. ఈ యోగంతో వ్యక్తి సంపద విపరీతంగా పెరుగుతుంది. విలాసాలు పొందుతాడు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. జ్ఞానం పెరిగి మంచి జీవితాన్ని గడుపుతారని చెబుతారు. ఈ మూడు రాశుల వారికి జూన్ 14 చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

కర్కాటక రాశి

బృహస్పతి ఐదవ అంశం కర్కాటక రాశి మూడో ఇంటిపై పడుతుంది. ఇది చంద్రుడి రాశి. అలాగే బృహస్పతి ఉన్నతమైన రాశి కర్కాటక రాశి. గజకేసరి రాజయోగం వల్ల వ్యక్తి ఆనందం, శ్రేయస్సు, సమృద్ధి అందిస్తుంది. ఫలితంగా అదృష్టం పూర్తి మద్ధతు లభిస్తుంది. కొత్త పనులు శ్రీకారం చుట్టేందుకు అనువైన కాలం. ప్రతి పనిని శ్రద్ధగా చేయడం వల్ల విజయం సాధిస్తారు. తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది. కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం లభిస్తుంది.

మిథున రాశి

చంద్రుడు మిథున రాశి నాలుగో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం మీకు అత్యంత ఫలవంతమైనది. సౌలభ్యం, లగ్జరీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. మీకోసం ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశ ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి పదో ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడబోతుంది. అన్ని రకాల భౌతిక ఆనందాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది గొప్ప సమయం. కెరీర్ లో మీరు విజయం సాధించేందుకు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్ లేదా వెంచర్ లో పని చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పనిలో మీకు మీ సీనియర్లకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారం నడుపుతున్న వారికి ఇది అద్భుతమైన సమయం.

WhatsApp channel