Jupiter transit 2024: బృహస్పతి అనుగ్రహం.. ఈ ఏడాది మొత్తం వీరికి అదృష్టం గరిష్ట స్థాయిలో ఉంటుంది
Jupiter transit 2024: బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు ఉంటాడు. అలా ఈ ఏడాది వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 2025 వరకు ఈ రాశుల వారికి అదృష్టం గరిష్ట స్థాయిలో ఉంటుంది.
Jupiter transit 2024: నవగ్రహాలలో దేవగురువుగా బృహస్పతిని భావిస్తారు. ఇది అదృష్ట, శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇతర గ్రహాల మాదిరిగానే బృహస్పతి తన రాశి, నక్షత్రాన్ని మార్చుకుంటూ సంచరిస్తుంది. ఈ ఏడాది మే 1 నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ప్రయాణం సాగిస్తోంది. 2025 మే వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు.
వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ సందర్భంలో బృహస్పతి ఏడాది పాటు శుక్రుడి రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. 2025 వరకు ఏయే రాశులకు బృహస్పతి వల్ల జీవితంలో సంతోషం, ఆనందం, అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
గురు సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుడి. 2025 వరకు ఈ రాశి వరకు సంపన్నులుగా ఉంటారు. గతంలో నిలిచిపోయిన పనులను ఇప్పుడు పునః ప్రారంభిస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మేష రాశి తొమ్మిది, పన్నెండు గ్రహాలకు బృహస్పతి అధిపతి. ఇప్పుడు రెండో ఇంట్లో సంచారం వల్ల అదృష్టం వస్తుంది.ఈ రాశి జాతకులు ఎప్పుడు అదృష్టవంతులుగా ఉంటారు. డబ్బు ఆదా చేసుకుంటారు. ప్రజల్లో వీరికి జనాదరణ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో వేగవంతమైన వృద్ధిని చూస్తారు. గతంలో చేసిన అప్పుల నుంచి విముక్తి పొందుతారు. విద్యాపరంగా రాణిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
వృషభ రాశి
బృహస్పతి 2025 వరకు ఇదే రాశిలో ఉండటం వల్ల వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఎనిమిది, పదకొండు గ్రహాలకు గురు గ్రహం పాలిస్తాడు. మేధస్సు, జ్యోతిష్యం, పరిశోధన సంబంధిత రంగాలలో పని చేసే వారికి గోప విజయాలు దక్కుతాయి. ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి పుంజుకునేందుకు ఇది అద్భుతమైన కాలం. కొత్త వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు. కానీ ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. బృహస్పతి ఆశీర్వాదంతో వివాహం జరుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమను అనుభవిస్తారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయం సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి ఆరు, తొమ్మిదో ఇంటికి గురువు అధిపతి. అందువల్ల ఈ వ్యక్తుల అదృష్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మీ లక్ష్యాలను సాధించడంలో ఎదురయ్యే సమస్యలు ఊహించని విధంగా తొలగిపోతాయి. బృహస్పతి అనుగ్రహంతో విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. కెరీర్ లో చాలా విజయవంతం అవుతారు. తోబుట్టువులతో సంబంధాలు మనోహరంగా ఉంటాయి. మీరు ఎదుర్కొనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి జీవితాన్ని ఆస్వాదిస్తారు.
సింహ రాశి
బృహస్పతి సింహ రాశి ఐదు, ఎనిమిది ఇంటికి పాలిస్తాడు. ఇప్పుడు పదకొండో ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు అందిస్తుంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. మీకు అప్పగించిన పని పూర్తి చేసేందుకు మీరు చూపించే కృషి ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అద్భుతమైన సమయం. గణనీయమైన లాభాలు పొందుతారు. వారసత్వంగా ఆస్తిని పొందుతారు. శృంగార జీవితం మాధుర్యంగా ఉంటుంది.