Sukraditya yogam: జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది-sun venus conjunction will create sukraditya rajayogam in mithuna rasi on june 12th 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sukraditya Yogam: జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది

Sukraditya yogam: జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది

Gunti Soundarya HT Telugu
Jun 05, 2024 11:09 AM IST

Sukraditya yogam: శుక్రుడు త్వరలో మిథున రాశిలో ప్రవేశిస్తాడు. తర్వాత సూర్యుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది.

జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం
జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం

Sukraditya yogam: సంపద, కీర్తి, సౌభాగ్యం, ప్రేమ, విలాసవంతమైన జీవితం, సంతోషాలను ప్రసాదించే శుక్రుడు జూన్ 12 వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జులై 6వరకు మిథున రాశిలో ఉంటాడు. సుమారు 406 రోజుల తర్వాత శుక్రుడు మిథున రాశిలోకి అడుగుపెడతాడు.

గ్రహాల రాజు సూర్యుడు కూడా జూన్ 15వ తేదీన మిథున రాశిలో సంచరిస్తాడు. ఒకే రాశిలో సూర్య, శుక్ర గ్రహాల కలయిక జరుగుతుంది. ఫలితంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రాదిత్య యోగం చాలా పవిత్రమైనది. సూర్య శుక్ర కలయిక వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. కెరీర్ ఎదుగుదలకు ఎన్నో సువర్ణావకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందం ఉంటుంది. ప్రతి పనిలో అదృష్టం మీకు మద్ధతు ఇస్తుంది. శుక్రాదిత్య యోగంతో ఏ రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం.

మేష రాశి

సూర్య, శుక్ర కలయిక ప్రభావంతో మేష రాశి వారికి శుభ దినాలు రాబోతున్నాయి. మాట తీరులో సౌమ్యత ఉంటుంది. కుటుంబ సభ్యులా సహకారంతో బాగా డబ్బు సంపాదిస్తారు. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి జీవితంలో శుభవార్తలు అందుకుంటారు.

వృషభ రాశి

అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు జీవితంలోని ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవిత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. కెరీర్ లో ఎదుగుదులకు మీరు ఆశించిన అవకాశాలు లభిస్తాయి.

కర్కాటక రాశి

ఈ రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా సుభిక్షంగా ఉంటారు.

సింహ రాశి

వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. డబ్బు సంపాదించేందుకు కొత్త సువర్ణావకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో పనికి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇంటి వాతావరణం సుఖ శాంతులతో ఆనందంగా ఉంటుంది. మీ లవర్ తో డేటింగ్ కూడా వెళతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా లభిస్తుంది.

మిథున రాశి

శుక్రాదిత్య యోగం మిథున రాశిలోనే ఏర్పడుతుంది. ఫలితంగా వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. పని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా ట్రిప్ కి వెళతారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటారు. వైవాహిక జీవితంలో రొమాన్స్ ఉంటుంది. దైవిక ఆరాధన పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి శుక్రాదిత్య యోగం శుభాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. శృంగారం, ఆకర్షణ జీవితంలో నిలిచిపోతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కెరీర్ లో కొత్త పనులు దొరుకుతాయి. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.

Whats_app_banner