తెలుగు న్యూస్ / ఫోటో /
Eyes Health Tips | మీ కంటి చూపు బాగుండాలంటే.. ఈ 5 అలవాట్లను వెంటనే మార్చుకోండి!
కళ్లు ఆరోగ్యంగా ఉంటే చూపు స్పష్టంగా ఉంటుంది. అయితే కొన్ని రోజూవారీ అలవాట్లతో కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి మీ కంటి ఆరోగ్యానికి మెరుగుపరుచుకోవాలంటే ఈ 5 అలవాట్లను మార్చుకోండి.
కళ్లు ఆరోగ్యంగా ఉంటే చూపు స్పష్టంగా ఉంటుంది. అయితే కొన్ని రోజూవారీ అలవాట్లతో కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి మీ కంటి ఆరోగ్యానికి మెరుగుపరుచుకోవాలంటే ఈ 5 అలవాట్లను మార్చుకోండి.
(1 / 9)
కంటి చూపు మందగించడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. అయితే చాలా మంది కంటి సమస్యలు ఎదురైనపుడు, దృష్టి లోపాలు ఏర్పడినపుడు వెంటనే కళ్లజోడు, కాంటాక్ట్ లెన్సులతో తమకున్న సమస్యను పరిష్కరించుకుంటారు. అంతేకానీ సహజంగా తమ దృష్టిని మెరుగుపరుచుకునే చర్యలు తీసుకోరు. విజన్ ఐ సెంటర్‌లో మెడికల్ డైరెక్టర్ అయిన డాక్టర్ తుషార్ గ్రోవర్.. జీవితాంతం కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే 5 అలవాట్లను మార్చుకోవాలని సూచించారు.(Anna Shvets)
(2 / 9)
ప్రతిరోజూ గంటల తరబడి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించే అలవాటు మీకు ఉంటే అది కంటి చూపుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది , ప్రత్యేకించి మొబైల్ ఫోన్ స్క్రీన్‌లపై చిన్నగా ఉండే అక్షరాలను చదవొద్దు. స్క్రీన్‌లకు ఎక్కువగా అతుక్కుపోతే అది కళ్ళకు హాని కలిగిస్తుంది, కళ్లు పొడిబారతాయి, తలనొప్పి, కంటి ఒత్తిడికి కారణమవుతుంది. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించాలి.(Ravi Kumar/HT)
(3 / 9)
ధూమపానంతో గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు దృష్టి సమస్యలను కూడా కలిగిస్తుంది. ధూమపానం సిగరెట్లు, ఇతర రకాల పొగాకు ఉత్పతులు ఉపయోగించే అలవాటుతో మాక్యులార్ డీజెనరేషన్, కంటిశుక్లం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఇది క్రమంగా అంధత్వానికి కూడా దారితీస్తుంది!(Pixabay)
(4 / 9)
సన్ గ్లాసెస్ ధరించడం మంచి అలవాటు. మీకు సన్ గ్లాసెస్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరిగే అలవాటు ఉంటే కఠినమైన మీ కళ్ళు హానికరమైన UV కిరణాలకు గురికావచ్చు. అది కంటి క్యాన్సర్ కు దారితీయవచ్చు. కాబట్టి కళ్లు బాగున్నపుడు సన్ గ్లాసెస్ ధరించలేకపోతే కళ్లు పోయాక బ్లాక్ గ్లాసెస్ ధరించాల్సి రావొచ్చు.(Pexels)
(5 / 9)
కళ్లను చీటికిమాటికి నలపడం, రుద్దడం చేయవద్దు. దీంతో మీ కళ్ల బయటి ఉపరితలం దెబ్బతింటుంది. కార్నియా బలహీనపడుతుంది, ధూళి, బ్యాక్టీరియా వ్యాప్తి జరుగుతుంది. ఇది దృష్టి క్షీణతకు కారణమవుతుంది. కళ్లు దురదగా అనిపిస్తే చల్లటి నీటితో కడుక్కోండి, అలాగే కోల్డ్ కంప్రెస్‌ని ఉపయోగించవచ్చు.(Karolina Grabowska)
(6 / 9)
డాక్టర్ సిఫారసు లేకుండా మీకు మీరుగా ఇష్టం వచ్చినట్లు కంటి చుక్కలను ఉపయోగించడం మంచి అలవాటు కాదు. కాబట్టి కంటి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే చుక్కలు వేసుకోండి.(Tyrone Siu / REUTERS)
(7 / 9)
పైన చెప్పిన అలవాట్లను మార్చుకోవడంతో పాటు మంచి నిద్ర, మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు