World Glaucoma Day | కంటి చూపును మెరుగుపరిచే ఐదు ఆసనాలు ఇవే..-world glaucoma day story 5 best yoga asana for glaucoma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Glaucoma Day | కంటి చూపును మెరుగుపరిచే ఐదు ఆసనాలు ఇవే..

World Glaucoma Day | కంటి చూపును మెరుగుపరిచే ఐదు ఆసనాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 12, 2022 12:02 PM IST

ఎలాంటి బాధలేకుండా.. పైకేమీ అనుమానం రాకుండా.. క్రమంగా చూపు హరించుకుపోవడమే గ్లకోమా. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ గ్లకోమాను తగ్గించుకునేందుకు.. కొన్ని యోగా భంగిమలు ఉన్నాయి. ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. కళ్లను రక్షించుకుందాం.

గ్లకోమా
గ్లకోమా

World Glaucoma Day | శరీరంలోని ఇతరభాగాలను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యమో.. కంటి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని తెలిపే ఒక సున్నితమైన రిమైండర్ ఇది. ఈ రోజు ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం, అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి కంటి ఒత్తిడి, కంటి లోపలి ఒత్తిడిని మనం తరచూ విస్మరిస్తూ ఉంటాం. గ్లకోమా రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం, కంటి లోపలి ఒత్తిడి 12 నుంచి 22ఎమ్ఎమ్ హెచ్​జీ సాధారణంగా పరిగణించబడుతుంది. 22 ఎమ్​ఎమ్​ హెచ్​జీ కంటే ఎక్కువ ఐఓపీ రీడింగ్ ఉంటే అది కంటి రక్తపోటుకు దారి తీస్తుంది. ఒక్కోసారి శాశ్వత దృష్టి నష్టానికి కూడా దారితీస్తుంది. దానిని నివారించడానికి కొన్ని యోగా భంగిమలు తప్పువు అంటున్నారు వైద్య నిపుణులు.

కంటి ఒత్తిడి ఎలా పెరుగుతుంది?

అధిక సజల ఉత్పత్తి లేదా దాని ప్రవాహానికి ఆటంకం కంటి ఒత్తిడి పెరుగుదలకు కారణం అవుతుంది. ఇది గ్లకోమాకు దారితీయవచ్చు. చాలా రకాల గ్లకోమాల్లో ఎలివేటెడ్ ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్ నరాల దెబ్బతినడంతో ముడిపడి ఉంటుంది.

దీని కోసం మీరు యోగాకు దూరంగా ఉండాలా?

లేదు! మీరు రోజూ యోగా సాధన చేయడం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని భంగిమలు, శ్వాస పద్ధతులను వాడకపోవడమే మంచిది. కంటి ప్రాంతం వైపు ఒత్తిడిని పెంచే భంగిమ చేస్తే.. ఒత్తిడి తీవ్రతరం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.

హెడ్‌స్టాండ్, హ్యాండ్‌స్టాండ్, షోల్డర్ స్టాండ్ వంటి భంగిమలను తప్పనిసరిగా నివారించాలి. అలాగే, పైభాగంలో లేదా తల వైపు ఒత్తిడి పెరగడానికి కారణమయ్యే ఎలాంటి భంగిమలను ఎక్కువసేపు ఉంచవద్దు. పాదహస్తాసనం, ధనురాసనం, చక్రాసనం వంటి భంగిమలు పూర్తిగా నివారించాలి. బదులుగా, మీరు దండాసనం, సావిత్రియాసనం, ఆనందాసనం మొదలైన సున్నితమైన భంగిమలను చేర్చవచ్చు.

కంటి ఒత్తిడిని తగ్గించే యోగా భంగిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నౌకాసనం (పడవ భంగిమ)

నౌకసనం ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ వైపుపై పడుకుని.. మీ పైభాగాన్ని నేల నుంచి 45 డిగ్రీల పైకి ఎత్తండి. అదే విధంగా 45 డిగ్రీల ఎత్తువరకు కాళ్లను కూడా పైకి ఎత్తండి. కాలి వేళ్లను మీ కళ్లతో సమలేఖం చేయడానికి ప్రయత్నించండి. మీ టెయిల్ బోన్​పై బ్యాలెన్స్ చేస్తూ.. వెనుకకు నేరుగా ఉంచండి. మీ చేతులు భూమికి సమాంతరంగా చేసి.. ఉదర కండరాలను నిమగ్నం చేయండి.

2. సుఖాసన

నిటారుగా ఉన్న భంగిమలో కూర్చోండి. దండసానాలో రెండు కాళ్లూ చాచాలి. ఎడమ కాలును మడిచి కుడి తొడ లోపల పెట్టాలి. కుడి కాలును కూడా మడిచి ఎడమ తొడ లోపలికి పెట్టాలి. మీ అరచేతులను మోకాళ్లపై ఉంచి.. వెన్నెముక నిటారుగా ఉంచి నిటారుగా కూర్చోవాలి.

3. వజ్రాసనం

ముందుగా మీ మోకాళ్లను సున్నితంగా కిందకు వదలండి. మీ మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచండి. కాలి వేళ్లను ఒకదానిపై ఒకటి ఉంచకండి. బదులుగా కుడి, ఎడమ కాలిని పక్కనే ఉంచి. మీ అరచేతులను మీ మోకాళ్లపై పైకి ఎదురుగా ఉంచండి. మీ వీపును నిఠారుగా చేసి ముందుకు చూడండి

4. అనులోమ్ విలోమ్

సుఖాసనం, అర్ధ పద్మాసనం, వజ్రాసనం లేదా పూర్ణ పద్మాసనం దీనిలో ఏ ఆసనంలోనైనా కుర్చోండి. మీ వీపును నిటారుగా ఉంచి భుజాలను రిలాక్స్‌గా ఉంచండి. కళ్లు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ అరచేతులను మీ మోకాళ్లపై పైకి ఎదురుగా ఉంచండి. మీ బొటన వేలితో మీ కుడి ముక్కు రంధ్రాన్ని సున్నితంగా మూసివేయండి. మీ ఎడమ నాసికా రంధ్రంలోకి గాలి పీల్చుకుని దానిని మూసివేయండి. కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాసను బయటకు పంపించండి. మీ కుడి నాసికా రంధ్రము ద్వారా ఊపిరి పీల్చుకుని.. మీ ఎడమ నాసికా రంధ్రం ద్వారా మాత్రమే ఊపిరి బయటకు పంపించండియ

5. ఉద్గీత్ ప్రాణాయామం

ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి (సుఖాసనం, అర్ధపద్మాసనం లేదా పద్మాసనం). వీపును నిఠారుగా చేయండి. కళ్లు మూసుకుని.. మీ అరచేతులను మీ మోకాళ్లపై పైకి ఎదురుగా ఉంచండి. లోతుగా ఊపిరి పీల్చుకుని.. మీ ఊపిరితిత్తులను గాలితో నింపండి. ఊపిరి పీల్చుకుంటూ, "ఓం" అని జపించండి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి

మంచి కంటి ఆరోగ్యం కోసం మీరు క్యారెట్‌లను జ్యూస్ లేదా సలాడ్ రూపంలో వారానికి రెండు నుంచి మూడు సార్లు తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా యోగా సాధనతో పాటు మీ ఆహారంలో పచ్చని ఆకు కూరలు, పండ్లను పుష్కలంగా చేర్చుకోండి.

WhatsApp channel