USA crime News: 11 ఏళ్ల విద్యార్థికి 33 వేల అసభ్య సందేశాలు పంపిన టీచర్
USA crime News: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు తన 11 ఏళ్ల విద్యార్థికి అసభ్య సందేశాలు పంపించింది. ఏడాది కాలంలో ఆమె పంపిన ఆ అసభ్య సందేశాల సంఖ్య దాదాపు 33 వేలు. ఈ లైంగిక వేధింపులపై ఆ లేడీ టీచర్ పై కేసు నమోదైంది. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో జరిగింది.
USA crime News: విస్కాన్సిన్ లోని ఓ స్కూల్ టీచర్ తన 11 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆ బాలుడికి ఏడాది కాలంలో దాదాపు 33,000 అసభ్యకరమైన మెసేజ్ లు పంపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ లేడీ టీచర్ పై కేసు నమోదు చేశారు. కోర్టు విచారణ సమయంలో, ఆ టీచర్ పంపిన అసభ్య సందేశాలను కోర్టులో బిగ్గరగా చదివి వినిపించడంతో 24 ఏళ్ల మాడిసన్ బెర్గ్ మన్ అనే ఆ టీచర్ సిగ్గుతో తల దించుకుంది.
'వారు ముద్దుల గురించి మాట్లాడారు'
పాఠశాలలోని ఒక ఉపాధ్యాయుడు ఆ టీచర్ కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాడు. ఆ బాలుడిని కౌగిలించుకోవడం ద్వారా శారీరక తృప్తిని పొందేదానినని ఆ ఉపాధ్యాయురాలు తనతో చెప్పిందని ఆ ఉపాధ్యాయుడు కోర్టుకు చెప్పారు. ఆ బాలుడు తన శరీరంలోని పలు ప్రాంతాలను టచ్ చేయడం కోసం అందుకు అనువైన దుస్తులను ధరిస్తున్నానని కూడా ఆమె చెప్పిందని ఆ ఉపాధ్యాయుడు కోర్టుకు చెప్పాడు. ఆ బాలుడితో ఆమె ముద్దులు, పెదవులు, బుగ్గలు, కాళ్లను తాకడం గురించి మాట్లాడేదని వెల్లడించాడు.
సెక్స్ లాంటిదేమీ జరగలేదు..
అయితే, నిందితురాలి తరఫు న్యాయవాది ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ బాలుడిని తన క్లయింట్ లైంగికంగా వేధించలేదని, వారి మధ్య సెక్స్ వంటిదేమీ జరగలేదని కోర్టుకు చెప్పాడు. వారిద్దరి మధ్య అసలు సెక్స్ గురించి చర్చ జరగలేదని నొక్కిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆ వాదనను కోర్టు తోసిపుచ్చింది. మాడిసన్ బెర్గ్ మన్ నేరాన్ని నిర్ధారించింది. ఆ 11 ఏళ్ల బాధిత బాలుడి తల్లి.. తన కుమారుడితో బెర్గ్ మన్ ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు విని, తన కుమారుడి ఫోన్ ను చెక్ చేసింది. ఆ ఫోన్ లో ఆ బాలుడికి ఆ టీచర్ పంపిన అసభ్య సందేశాలను చూసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
క్లాస్ రూమ్ లో అనుభవాల వివరాలతో ఫైల్
టీచర్ మాడిసన్ బెర్గ్ మన్ తరగతి గదిలో దాచిన ఫోల్డర్ ను పోలీసులు కనుగొన్నారు. పాఠశాలలోని ఆమె తరగతి గదిలో పోలీసులు తనిఖీ చేయగా అందులో బాధితురాలి పేరు ఉన్న ఫోల్డర్ కనిపించింది. ఫోల్డర్ లోపల ఆ బాలుడితో శారీరక అనుభవాలను వివరించే చేతిరాతతో కూడిన నోట్స్ ఉన్నాయి. ఆ నోట్స్ లో తాను ఆ బాలుడిని ప్రేమిస్తున్నానని, అతన్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నానని, అతను సహకరించడం లేదని, తాను అతనిపై వ్యామోహంతో ఉన్నానని ఆ నోట్స్ లో ఉంది. నిజానికి, బెర్గ్ మన్ వివాహం నిశ్చయమైంది. ఈ ఆరోపణలతో ఆ వివాహం రద్దు అయింది. స్కూల్ లో ఆమె ఉద్యోగం కూడా పోయింది. నేరం రుజువైతే ఆమెకు సుదీర్ఘ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.