తెలుగు న్యూస్ / ఫోటో /
Pat Cummins: ‘నీ భార్య ప్రేమిస్తున్నా’ అంటూ నెటిజన్ కామెంట్.. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఎలా స్పందించాడంటే..
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన భార్యతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు. దీనికి ఓ ఇండియన్ ఫ్యాన్ కామెంట్ చేయగా.. అతడు రిప్లే ఇచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. వివరాలివే..
(1 / 5)
వాలైంటైన్స్ డే సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తన భార్య బెకీ బోస్టన్‍తో ఉన్న ఓ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశాడు. సూపర్ వైఫ్ అంటూ తన భార్యకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పాడు. (Instagram)
(2 / 5)
కమిన్స్ పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ఇండియన్ ఫ్యాన్ ఓ కామెంట్ చేశాడు. “నేను ఇండియన్. నేను నిన్ను.. నీ భార్యను ప్రేమిస్తున్నా” అని కామెంట్ చేశాడు.
(3 / 5)
‘నీ భార్యను ప్రేమిస్తున్నా’ అనే కామెంట్‍కు కమిన్స్ స్పందించాడు. నేను ఈ విషయాన్ని ఆమెకు చెబుతా” అని సరదాగా రిప్లే ఇచ్చాడు కమిన్స్.
(4 / 5)
గతేడాది 2023 ప్యాట్ కమిన్స్ కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. గతేడాది అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్, వన్డే ప్రపంచకప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఈ రెండు ఫైనళ్లలో భారత్‍ను ఆసీస్ ఓడించింది. (REUTERS)
ఇతర గ్యాలరీలు