AP Tourism : వివాహం కుదిర్చే.. వ్యాఘ్ర నరసింహుడు.. ఎక్కడున్నాడో తెలుసా?
- AP Tourism : ఏలూరు జిల్లాలో దక్షిణ సింహాచలం ఉంది. అవును.. ఈ క్షేత్రంలో శివకేశవులు ఒకేచోట కొలువైన ఉన్నారు. పెళ్లి కానివారు, శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. వివాహం కుదురుతుందని భక్తుల నమ్మకం.
- AP Tourism : ఏలూరు జిల్లాలో దక్షిణ సింహాచలం ఉంది. అవును.. ఈ క్షేత్రంలో శివకేశవులు ఒకేచోట కొలువైన ఉన్నారు. పెళ్లి కానివారు, శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. వివాహం కుదురుతుందని భక్తుల నమ్మకం.
(1 / 5)
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల కేంద్రంలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహుడు పర్వతశిఖరంపైన కొలువై ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. ఓ మహారాజు కోరిక మేరకు ఇక్కడ స్వయంభువుగా వెలసినట్టు చరిత్ర చెబుతోంది.
(2 / 5)
ఇక్కడ స్వామివారు నవ నారసింహ రూపాలలో ఒకటైన పులి రూపంలో దర్శనమిస్తారు. శివకేశవులు ఒకేచోట కొలువైన ఈ క్షేత్రానికి దక్షిణ సింహాచలం అనే పేరుంది. అవివాహితులు, శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు.
(3 / 5)
సుమారు నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రాన్ని.. నూజివీడు జమీందారులు అభివృద్ధి పరిచారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ వారి వారసులే స్వామి సేవలో తరిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఏ కార్యక్రమం జరిగినా నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ రావు పాల్గొని ప్రారంభిస్తారు.
(4 / 5)
కృతయుగంలో శుభవ్రత అనే మహారాజు మహావిష్ణువు కోసం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారట. అప్పుడు రాజు తాను ఈ ప్రదేశంలోనే పర్వత ఆకారం దాల్చుతాననీ... తనపైన లక్ష్మీసమేతంగా కొలువుదీరమంటూ వేడుకున్నాడట. అలా స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. యోగముద్రలో దర్శనమిచ్చే స్వామి చెవిలో భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటే అవి ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరతాయనీ నమ్మకం. పెళ్లి కానివారు ఇక్కడ శాంతి కల్యాణం జరిపిస్తే.. వారికి వివాహం కుదురుతుందని భక్తులు చెబుతున్నారు.
(5 / 5)
ఈ ఆలయం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల కేంద్రంలో ఉంటుంది. విజయవాడ, ఏలూరు వరకు ట్రైన్‌లో రావొచ్చు. విజయవాడ నుంచి అనేక బస్సు సర్వీసులు ఆగిరిపల్లికి ఉంటాయి. నూజివీడు నుంచి 20 కిలోమీటర్లు, ఏలూరు జిల్లా కేంద్రం నుంచి 44 కిలో మీటర్లు ఉంటుంది. ఏలూరు నుంచి కూడా బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు