Bathukamma festival : అమెరికాలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు.. ఘనంగా సంబరాలు!-many american states officially recognize bathukamma festival declares telangana heritage week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bathukamma Festival : అమెరికాలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు.. ఘనంగా సంబరాలు!

Bathukamma festival : అమెరికాలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు.. ఘనంగా సంబరాలు!

Sharath Chitturi HT Telugu
Oct 07, 2024 12:27 PM IST

Bathukamma festival in USA : అమెరికాలోని వివిధ రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపును ఇస్తున్నాయి. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ‘తెలంగాణ హెరిటేజ్​ వీక్​’ని కూడా ప్రకటించాయి.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు..
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు.. (Style Photo Service)

తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతికి ఉన్న ఘన చరిత్రకు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. తెలంగాణలో ఎంతో విశిష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు అమెరికాలోనూ ప్రాముఖ్యత పెరుగుతోంది. అక్కడి తెలుగువారు భారీ సంఖ్యలో బంతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలోని అనేక రాష్ట్రాలు.. బతుకమ్మకు అధికారిక గుర్తింపును ఇస్తున్నాయి. ఈ జాబితాలో నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా ఇప్పటికే చేరాయి.

చార్లెట్టే మేయర్​ మరో అడుగు ముందుకేసి.. బతుకమ్మ మీద ఒక ప్రొక్లమేషన్​ (ప్రకటన)ని కూడా విడుదల చేశారు.

"విభిన్న భాషలు, సంప్రదాయాలకు నెలవు తెలంగాణ. భారత దేశ బహుళత్వం, కలుపుకోలు తనానికి తెలంగాణ వెన్నెముకగా నిలుస్తూ వస్తోంది. నార్త్​ కరోలినా, చార్లెట్టే సిటీ కలిసిగట్టుగా ఉండేందుకు తెలుగు భాష మాట్లాడే సమాజం కృషి చేస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన చార్లెట్టేలోని తెలుగు సమాజం ఇక్కడి సంప్రదాయ వైవిధ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతోంది. అంతేకాకుండా నార్త్​ కొరిలినాలోని వైద్య, ఇంజినీరింగ్​, రాజకీయ, లీగల్​, సంక్షేమ రంగాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది. అందుకే తెలంగాణ ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపును ప్రకటిస్తున్నాము. అక్టోబర్​ 3 నుంచి 11 వరకు తెలంగాణ హెరిటేజ్​ వీక్​గా ప్రకటిస్తున్నాను," అని చార్లెట్టే మేయర్​ వీ అలెగ్జ్యాంజర్​ లైలెస్​ చేసిన ప్రకటనలో ఉంది.

ఈ ప్రొక్లమేషన్​లో తెలంగాణ వారసత్వం గురించి, బతుకమ్మ పండుగ విశిష్టత గురించి చాలా వివరంగా పొందుపరిచారు.

తెలుగు ప్రజలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో చార్లెట్టే ముందుంటుంది. మే 28ని 'తెలుగు హెరిటేజ్​ డే'గా జరుపుకోవాలని నగర ప్రజలకు అధికారులు గతేడాది పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ భాషను ఘనంగా కీర్తిస్తూ ప్రకటనలు చేశారు.

అటు జార్జియాలోనూ బతుకమ్మకు విశిష్ట ప్రాధాన్యత లభిస్తోంది. 2023లోనే అక్కడ బతుకమ్మ పండుగ అత్యంత ఘనంగా జరిగింది. దీని ప్రధాన కారణం నాడు, జార్జియా గవర్నర్​ బ్రెయిన్​ పీ. కెంప్​.. బతుకమ్మ పండుగ నేపథ్యంలో 'తెలంగాణ హెరిటేజ్​ వీక్​'ని ప్రకటించారు. అక్టోబర్​ 3వ వారంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి.

రానున్న కాలంలో అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపునిచ్చే రాష్ట్రాల సంఖ్య మరింత పెరగొచ్చు. మరోవైపు ఈ ఏడాది తెలంగాణతో పాటు అమెరికాలోనూ బతుకమ్మ పండుగ హడావుడి కనిపిస్తోంది. అమెరికాలోని చాలా నగరాల్లో తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. వారిని చూసేందుకు చాలా మంది ఆసక్తిగా వెళుతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

బతుకమ్మ పండుగ వెనుక 1000ఏళ్ల చరిత్ర..!

బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైందో తొలిసారి ఎందుకు నిర్వహించుకున్నారో చెప్పడానికి మాత్రం ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథలలో వెయ్యేళ్ల నాటి కథ కూడా ఒకటి ఉంది. బతుకమ్మ పుట్టింది ఆనందంతో కాదు, తెలంగాణ ఆడపిల్లల బాధ నుంచే. తమ బాధను తెలియజేయడానికి బతుకమ్మ పండగను వినియోగించుకున్నారు తెలంగాణ మహిళలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం