ICAI CA Inter and Final Result 2024: ఐసీఏఐ సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ రేపే.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి-icai ca inter and final result 2024 releasing tomorrow at icai org details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icai Ca Inter And Final Result 2024: ఐసీఏఐ సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ రేపే.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ICAI CA Inter and Final Result 2024: ఐసీఏఐ సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ రేపే.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

ఐసీఏఐ సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ జూలై 11 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ icai.org ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఐసీఏఐ సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ (Representational image)

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 2024 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను జూలై 11, 2024 న విడుదల చేయనుంది. పరీక్షకు హాజరై తమ ఫలితాలను చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ icai.org ను సందర్శించవచ్చు.

ఇంటర్ అండ్ ఫైనల్ రిజల్ట్స్

చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలను 2024 మేలో నిర్వహించారు. వాటి ఫలితాలను 2024 జూలై 11 గురువారం ప్రకటించనున్నారు. తమ ఫలితాలను విద్యార్థులు icai.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. icai.nic.in వెబ్సైట్లో ఫలితాలను యాక్సెస్ చేయడానికి విద్యార్థి తన రోల్ నంబర్ తో పాటు రిజిస్ట్రేషన్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ (ICAI) గ్రూప్-1 కోసం ఐసీఏఐ సీఏ ఇంటర్ పరీక్షను 2024 మే 3, 5, 9 తేదీల్లో నిర్వహించారు. 2024 మే 11, 15, 17 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. 2024 మే 2, 4, 8 తేదీల్లో సీఏ ఫైనల్ గ్రూప్-1 పరీక్షలు, 2024 మే 10, 14, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. 2024 మే 14, 16 తేదీల్లో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు.

రిజల్ట్స్ ఇలా చూసుకోండి

ఐసీఏఐ ఇంటర్, ఫైనల్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • ముందుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో ఐసీఏఐ సీఏ రిజల్ట్ 2024 చెక్ చేయడానికి లింక్ కోసం చూడండి మరియు ఆ లింక్ (ICAI CA Result 2024) పై క్లిక్ చేయండి.
  • ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. అక్కడ విద్యార్థులు తమ ఫలితాలను చేసుకోవచ్చు. అయితే, అందుకు విద్యార్థులు వారి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  • లాగిన్ క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేసిన తరువాత, ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి.
  • వివరాలను చెక్ చేసుకుని, పేజీని సేవ్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం పేజీని డౌన్ లోడ్ చేయండి. ప్రింట్ తీసుకోండి.
  • మరింత సమాచారం కోసం icai.org వెబ్ సైట్ ను సందర్శించండి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.