ICAI CA result 2024 date and time : చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల ఫలితాలను జూలై మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధికారి ఒకరు సోమవారం తెలిపారు.
"సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు జూలై మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంది. జూలై 2, 3 తేదీల్లో కౌన్సిల్ మీటింగ్ ఉంది కాబట్టి బహుశా జూలై 5 ఫలితాల తేదీ కావచ్చు" అని సీసీఎం ధీరజ్ ఖండేల్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేసి, మరిన్ని వివరాల తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి ఉండాలని అభ్యర్థులను కోరారు.
అభ్యర్థులు icai.nic.in లేదా icai.org సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలను చూసుకోవచ్చు. తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ICAI CA inter result 2024 : సంబంధిత పరీక్షల ఫలితాలు సాధారణంగా నెల రోజుల్లోనే ప్రకటిస్తారు.
ఐసీఏఐ సీఏ ఇంటర్ మే పరీక్షలు మే 3, 5, 9 తేదీల్లో గ్రూప్ 1 అభ్యర్థులకు, మే 11, 15, 17 తేదీల్లో గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగాయి.
మే 2, 4, 8 తేదీల్లో గ్రూప్-1 అభ్యర్థులకు సీఏ ఫైనల్ పరీక్ష నిర్వహించారు. మే 10, 14, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరిగింది. 2024 మే 14, 16 తేదీల్లో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు.
ఈసారి.. సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలను ఒకే రోజు విడుదల చేసే అవకాశం ఉంది.
ఫలితాలను ప్రకటించినప్పుడు, అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని అనుసరించడం ద్వారా ఐసీఏఐ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..
ICAI CA final result 2024 : icai.nic.in ఐసీఏఐ ఫలితాల వెబ్‌సైట్‌కి వెళ్లి తనిఖీ చేయడానికి దశలు.
స్టెప్ 1:- ఫలితాలు విడుదల చేసిన అనంతరం.. సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి సీఏ ఇంటర్ లేదా సీఏ ఫైనల్ రిజల్ట్ లింక్ ఓపెన్ చేయాలి.
స్టెప్ 2:- మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
స్టెప్ 3:- తర్వాతి పేజీలో మీ రిజల్ట్ చెక్ చేసుకోండి.
స్టెప్ 4:- తదుపరి అవసరాల కోసం ఫలితాల్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫలితాలతో పాటు గ్రూపుల వారీగా టాపర్ల పేర్లు, వారి స్కోర్లను ఐసీఏఐ ప్రకటిస్తుంది.
ICAI CA result 2024 latest updates : ప్రతి గ్రూపులో రిజిస్టర్ చేసుకున్న, హాజరైన, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, ఇతర వివరాలను కూడా ఇందులో పొందుపరుస్తారు.
సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సంబంధిత కథనం