ICAI CA exam dates: సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐసీఏఐ
ICAI CA exam dates: సెప్టెంబర్ సెషన్ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) శనివారం ప్రకటించింది. వీటిలో ఫౌండేషన్ ఎగ్జామినేషన్ 3, 4 పేపర్లు 2 గంటల వ్యవధితో ఉంటాయని, మిగతా పరీక్షలన్నీ 3 గంటల వ్యవధితో ఉంటాయని ఐసీఏఐ వెల్లడించింది.
సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీల విడుదల (Thinkstock/ Representative image)
ICAI CA exam dates: సెప్టెంబర్ 2024 సీఏ ఫౌండేషన్ (CA Foundation), సీఏ ఇంటర్మీడియట్ (CA Inter) పరీక్షల తేదీలు, షెడ్యూల్ ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) శనివారం అధికారిక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. రిజిస్టర్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షల షెడ్యూల్ ను ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ పరీక్షను 2024 సెప్టెంబర్ 13, 15, 18, 20 తేదీలలో నిర్వహిస్తారు.
- గ్రూప్-1 కోసం సీఏ ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షను 2024 సెప్టెంబర్ 12, 14, 17 తేదీల్లో నిర్వహిస్తారు.
- గ్రూప్-2 కోసం సీఏ ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షను 2024 సెప్టెంబర్ 19, 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు.
- మిలాద్ ఉన్ నబీ పండుగ సెలవు కారణంగా సెప్టెంబర్ 16వ తేదీన ఏ పరీక్షలు నిర్వహించరు.
- ఫౌండేషన్ ఎగ్జామినేషన్ 3, 4 పేపర్లు 2 గంటల వ్యవధి కలిగి ఉంటాయి. మిగతా పరీక్షలన్నీ 3 గంటల పాటు జరుగుతాయి.
- భారతదేశంలో ఈ పరీక్షలు జరిగే నగరాల జాబితాను కూడా అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
- అలాగే, భారతదేశం వెలుపల అబుదాబి, బహ్రెయిన్, థింపు (భూటాన్), దోహా, దుబాయ్, ఖాట్మండు (నేపాల్), కువైట్, మస్కట్ లలో కూడా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్ష కోసం
- సీఏ ఇంటర్మీడియెట్ పరీక్షకు సంబంధించి జులై 7వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
- అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై 20, 2024 (ఆలస్య రుసుము లేకుండా).
- ఆలస్య రుసుము రూ.600/- లేదా 10 అమెరికన్ డాలర్లతో జూలై 23వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
- కరెక్షన్ విండో జూలై 24న ఓపెన్ అవుతుంది. జులై 26వ తేదీ వరకు ఉంటుంది.
ఫౌండేషన్ ఎగ్జామ్ కోసం
- సీఏ ఫౌండేషన్ పరీక్షకు జులై 28వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ 10, 2024 (ఆలస్య రుసుము లేకుండా).
- ఆలస్య రుసుము రూ.600/- లేదా 10 అమెరికన్ డాలర్లు చెల్లించి ఆగస్ట్ 13 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
- కరెక్షన్ విండో జూలై 24న ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 14 నుంచి ఆగస్ట్ 16వ తేదీ వరకు ఉంటుంది.
- పరీక్ష ఫీజులు, ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.