RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్
4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే ఈ కింది స్టెప్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ rpf.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
RRB RPF Recruitment 2024: ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 14, 2024 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4660 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ rpf.indianrailways.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఆర్పీఎఫ్ లో 4660 పోస్ట్ లు..
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్ట్ ల భర్తీకి ఆర్ఆర్బీ 2024 ఏప్రిల్ 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 452 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు, 4208 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లై చేసిన అభ్యర్థులకు దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో 2024 మే 15 నుంచి మే 24 వరకు అందుబాటులో ఉంటుంది.
ఆర్బీఎఫ్ జాబ్స్ కు అర్హతలు
ఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 2024 జూలై 1 నాటికి 18-28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్ఐ పోస్టులకు కటాఫ్ తేదీ నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. పైన పేర్కొన్న పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
ఇలా అప్లై చేయండి..
- ముందుగా ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ rpf.indianrailways.gov.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 (RRB RPF Recruitment 2024) లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కనిపిస్తుంది.
- అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరచుకోవాలి.
దరఖాస్తు ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఇందులో సీబీటీకి హాజరైన అభ్యర్థులకు, బ్యాంక్ చార్జీలు మినహాయించుకుని రూ. 400 రీఫండ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) అభ్యర్థులకు ఫీజు రూ.250. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.